Griha Lakshmi Yojana: మహిళలకు గుడ్‌న్యూస్.. రక్షాబంధన్ కానుక ఇవ్వనున్న సిద్ధరామయ్య సర్కారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Griha Lakshmi Yojana: కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం గృహలక్ష్మి యోజన ద్వారా మహిళలకు బహుమతులు ఇవ్వబోతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గృహలక్ష్మి యోజనను ప్రారంభించనుంది. ఖర్గే, రాహుల్ సమక్షంలో కోటి మందికి పైగా మహిళలకు నెలకు రూ.2,000 భృతి ఇవ్వనున్నారు. మైసూర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు సమాచారం అందించారు. అధికారుల ప్రకారం, గృహ లక్ష్మి యోజన కోసం సుమారు 1.08 కోట్ల మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వం ఇచ్చిన ఐదు హామీల్లో ఈ పథకం ఒకటి. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడంపై ఐదు హామీలు ఇచ్చింది.
Read Also: Mamata Banerjee: డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు..! సంచలన ప్రకటన
Also Read
- Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
- PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
- US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. "నిఘా"పై పెంటగాన్ హెచ్చరిక..
- Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
ఈ వేడుకలకు లక్ష మంది తరలివస్తారని సీఎం సిద్ధరామయ్య విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహిస్తారని, ఆయన సమక్షంలో గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. దీంతో పాటు రాహుల్ గాంధీ కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు. కార్యక్రమం గురించి సమాచారం ఇస్తూ.. ఇది ప్రభుత్వ కార్యక్రమం అని, కాబట్టి ఖర్గేను రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆహ్వానించడం జరిగిందని సిద్ధరామయ్య చెప్పారు. ఇది పార్టీ కార్యక్రమం కాదని ఆయన స్పష్టం చేశారు. అంతే కాకుండా తమ ప్రభుత్వం ఇప్పటికే ఐదు హామీల్లో మూడింటిని అమలు చేసిందని, అందులో మూడు పథకాలు ‘శక్తి’, ‘గృహ జ్యోతి’, ‘అన్నభాగ్య’లను ఇప్పటికే అమలు చేశామని సీఎం సిద్ధరామయ్య గుర్తు చేశారు. కాగా ‘గృహలక్ష్మి’ నాలుగో పథకం.
గృహ లక్ష్మీ యోజన అంటే ఏమిటి?
రాష్ట్ర ప్రభుత్వ గృహలక్ష్మి పథకానికి 1.08 కోట్ల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారని గతంలో సిద్ధరామయ్య కూడా గత వారం తెలియజేశారు. గృహ లక్ష్మి యోజన కింద నెలకు రూ. 2,000 నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది. సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గృహ లక్ష్మీ యోజన కోసం రూ.17,500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.
తాజావార్తలు
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!