భాద్యత కలిగిన పోస్టులో ఉండి భాద్యతారాహిత్యమైన పనులకు తెరలేపాడు డీజీపీ స్థాయి అధికారి. ఏకంగా ఆఫీసులోనే అసాంఘిక కార్యకలాపాకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. కర్ణాటక డీజీపీ కె. రామచంద్రరావు మహిళలతో చనువుగా ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వరుస అసభ్యకరమైన వీడియోలు వైరల్ కావడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ వీడియో కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది. కాగా రామచంద్ర తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు, తనను ఇరికించారని ఆరోపించారు.వీడియో కుంభకోణం తర్వాత, రామచంద్రన్ కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వరను కలిసేందుకు వచ్చారు. కానీ ఇద్దరూ కలవలేకపోయారు. హోం మంత్రి నివాసం వెలుపల మీడియాతో మాట్లాడిన రామచంద్రన్, “ఇది పూర్తిగా కల్పితం, వీడియో పూర్తిగా నకిలీది” అని అన్నారు.
Also Read:Kamchatka Snowfall: నాలుగు అంతస్తులను కప్పేసిన మంచు.. ఒక రాత్రిలో మంచు పర్వతంగా మారిన నగరం (వీడియో)
రామచంద్రరావు రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారి, పౌర హక్కుల అమలు డైరెక్టరేట్ (DCRE) డైరెక్టర్ జనరల్ (DGP). ఆయన తన కార్యాలయంలో ఒక మహిళతో ఉన్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. ఆ వీడియోలలో, డీజీపీ రామచంద్రరావు తన కార్యాలయంలో ఒక మహిళతో సాన్నిహిత్యంలో పాల్గొంటున్నట్లు కనిపిస్తుంది. ఒక వీడియోలో, ఆయన యూనిఫాంలో తన కుర్చీలో కూర్చుని ఆ మహిళతో అనుచితంగా ప్రవర్తించినట్లు కనిపిస్తుంది. మరో వీడియోలో, ఆయన సూట్ ధరించి, ఆయన గదిలో భారత జెండా, త్రివర్ణ పతాకం, పోలీసు శాఖ చిహ్నం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Also Read:Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. హరీష్‌రావుకు సిట్ నోటీసులు..
ఆధారాల ప్రకారం, ఈ వీడియోలు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. అవి దాదాపు ఒక సంవత్సరం నాటివిగా చెబుతున్నారు. అవి సినిమా నటి రన్యా రావు బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టు కావడానికి ముందు నాటివని భావిస్తున్నారు. అయితే, ఈ వీడియోలు ఇప్పుడు ఎందుకు విడుదలయ్యాయో ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. రామచంద్రరావు వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. బంగారం అక్రమ రవాణా కేసులో మార్చి 2025లో అరెస్టయిన జైలు శిక్ష అనుభవిస్తున్న రన్యారావుకు ఆయన సవతి తండ్రి. తన తండ్రి స్థానాన్ని ఆసరాగా చేసుకుని ప్రోటోకాల్‌ను దుర్వినియోగం చేసిందని రన్యాపై ఆరోపణలు ఉన్నాయి.