Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Karnataka Deputy Cm Dk Shivakumar Claims Bjp Active To Destabilise Govt

DK Shiva Kumar: ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు

Published Date :October 18, 2023 , 9:01 pm
By Mahesh Jakki
DK Shiva Kumar: ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

DK Shiva Kumar: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీలో ఓ టీమ్‌ పనిచేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమను ఎవరు సంప్రదిస్తున్నారో, వారికి ఏమి అందిస్తున్నారో తనకు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు తెలియజేస్తున్నారని శివకుమార్ అన్నారు. ఈ విషయాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల ద్వారా వెల్లడిస్తానని డిప్యూటీ సీఎం శివకుమార్ తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ‘అవును.. మాకు తెలుసు.. ఎమ్మెల్యేలంతా తమను ఎవరు కలుస్తున్నారో నాకు, ముఖ్యమంత్రికి పూర్తి సమాచారం ఇస్తున్నారని.. వారికి ఏం ఆఫర్ చేస్తున్నారో చెబుతున్నారని వెల్లడించారు. కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీలో ఓ బృందం క్రియాశీలకంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం మీడియాకు వివరించారు. అన్ని విషయాలపై మా వద్ద సమాచారం ఉంది… ఇప్పుడు కాదు, అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు సంప్రదించిన ఎమ్మెల్యేల నుంచి వెల్లడిస్తామని తెలిపారు.

Also Read: Congress Bus Yatra 2023: కాంగ్రెస్ విజయభేరి యాత్రను ప్రారంభించిన రాహుల్‌ గాందీ, ప్రియాంక

సింగపూర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరుగుతోందని శివకుమార్ గతంలో కూడా పేర్కొన్నారు. కర్ణాటకలో ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధిస్తున్నట్లు ఇటీవల కాంగ్రెస్‌ చేసిన ప్రకటనపై బీజేపీ నేత ఆర్.అశోక్‌ మాట్లాడుతూ.. ఒకప్పుడు పార్లమెంట్‌లో కాంగ్రెస్‌కు మెజారిటీ ఉండేదని, దేశంలోని 15-20 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉండేవని, అయితే ఇలాంటి వాటి వల్ల కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని అశోక్ అన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే ఆర్‌ఎస్‌ఎస్‌ని నిషేధించండి, మీ ప్రభుత్వం మూడు నెలలు కూడా ఉండదని ఆయన అన్నారు. ఈ ఏడాది 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించింది. అదే సమయంలో బీజేపీ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • congress
  • dk shivakumar
  • karnataka
  • Karnataka Deputy CM

తాజావార్తలు

  • SRH vs RR: కాటేరమ్మకొడుకుల దెబ్బకు అల్లాడిన రాజస్థాన్.. ఐపీఎల్ చరిత్రలోనే దారుణమైన రికార్డ్

  • Kejriwal vs Judge: ఆర్ఎస్ఎస్ జడ్జ్‌లు న్యాయం చేయలేరు.. జస్టిస్‌పై కేజ్రీవాల్ ఆరోపణలు వైరల్

  • NTRNEEL : మరోసారి తారక్‌తో జోడీ కట్టనున్న ఆలియా భట్

  • Chinta Mohan: అమరావతి రాజధాని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ఇష్టంలేదు.. తిరుపతిని ఏపీ రాజధాని చేయండి..

  • Saqib Hussain Debut: ఈ ప్రదర్శనను అస్సలు ఊహించలేదు.. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions