Site icon NTV Telugu

DK Shiva Kumar: ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు

Dk Shiva Kumar

Dk Shiva Kumar

DK Shiva Kumar: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీలో ఓ టీమ్‌ పనిచేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమను ఎవరు సంప్రదిస్తున్నారో, వారికి ఏమి అందిస్తున్నారో తనకు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు తెలియజేస్తున్నారని శివకుమార్ అన్నారు. ఈ విషయాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల ద్వారా వెల్లడిస్తానని డిప్యూటీ సీఎం శివకుమార్ తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ‘అవును.. మాకు తెలుసు.. ఎమ్మెల్యేలంతా తమను ఎవరు కలుస్తున్నారో నాకు, ముఖ్యమంత్రికి పూర్తి సమాచారం ఇస్తున్నారని.. వారికి ఏం ఆఫర్ చేస్తున్నారో చెబుతున్నారని వెల్లడించారు. కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీలో ఓ బృందం క్రియాశీలకంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం మీడియాకు వివరించారు. అన్ని విషయాలపై మా వద్ద సమాచారం ఉంది… ఇప్పుడు కాదు, అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు సంప్రదించిన ఎమ్మెల్యేల నుంచి వెల్లడిస్తామని తెలిపారు.

Also Read: Congress Bus Yatra 2023: కాంగ్రెస్ విజయభేరి యాత్రను ప్రారంభించిన రాహుల్‌ గాందీ, ప్రియాంక

సింగపూర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరుగుతోందని శివకుమార్ గతంలో కూడా పేర్కొన్నారు. కర్ణాటకలో ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధిస్తున్నట్లు ఇటీవల కాంగ్రెస్‌ చేసిన ప్రకటనపై బీజేపీ నేత ఆర్.అశోక్‌ మాట్లాడుతూ.. ఒకప్పుడు పార్లమెంట్‌లో కాంగ్రెస్‌కు మెజారిటీ ఉండేదని, దేశంలోని 15-20 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉండేవని, అయితే ఇలాంటి వాటి వల్ల కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని అశోక్ అన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే ఆర్‌ఎస్‌ఎస్‌ని నిషేధించండి, మీ ప్రభుత్వం మూడు నెలలు కూడా ఉండదని ఆయన అన్నారు. ఈ ఏడాది 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించింది. అదే సమయంలో బీజేపీ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది.

 

Exit mobile version