coconut auction ₹5.71 lakhs: కాలాలు మారిన, యూగాలు గడిచిన దేవుడిపై ప్రజల్లో ఉండే అచంచలమైన భక్తిలో మాత్రం మార్పులేదు. తమను నడిపించే ఓ అపూర్వ శక్తి భగవంతుడని ఎంతో మంది జనాల విశ్వాసం. అచ్చం ఇలాంటి విశ్వసమే ఈ గ్రామస్థులది కూడా. అందుకే అక్కడ ఓ కొబ్బరికాయ ధర ఏకంగా రూ. 5.71లక్షలు పలికింది. టెంకాయకు లక్షల్లో ధర పలికిన ఈ ఘటన కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా జంఖండి తాలూకాలోని చిక్కలఖి గ్రామంలో వెలుగుచూసింది. అసలు ఏంటీ కథ అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: KTR : తెలంగాణకు బీజేపీ ఎన్నో గాయాలు చేసింది
చిక్కలఖి గ్రామంలో మలింగరాయ జాతర..
జంఖండి తాలూకాలోని చిక్కలఖి గ్రామంలో ప్రతి సంవత్సరం మలింగరాయ జాతరను వైభవంగా నిర్వహిస్తారు. గ్రామంలో ప్రతి ఏడాది శ్రావణమాసంలో జరిగే వివిధ పండుగల ముగింపు సమయంలో ఈ జాతరను నిర్వహిస్తారు. అలాగే ఈ ఏడాది కూడా గ్రామంలో వైభవంగా జాతరను నిర్వహించారు. జాతర ముగింపు సమయంలో ఇక్కడ దేవత సింహాసనంపై ఉంచిన వస్తువులను వేలం వేసే సంప్రదాయం ఉంది. మలింగరాయ సింహాసనంపై పూజించే కొబ్బరికాయకు ఇక్కడ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది సాధారణ కొబ్బరికాయ కాదని, ఈ కొబ్బరికాయను దేవునికి సమర్పించినదనిగా ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. వాస్తవానికి దీనికి ధర లేదని ఇక్కడి భక్తుల నమ్మకం. కొబ్బరికాయ వేలం ప్రక్రియ ప్రారంభమైన తర్వాత… ఒకటి, రెండు లక్షల నుంచి ప్రారంభమై చివరికి రూ.5,71,001 లకు ఓ భక్తుడు కొబ్బరికాయను గెలుచుకున్నాడు. విజయపుర జిల్లాలోని టికోటా గ్రామానికి చెందిన మహావీర్ హరకే అనే భక్తుడు కొనుగోలు చేశాడని కమిటీ సభ్యులు తెలిపారు.
గతంలో కూడా నాకే దక్కింది.. మహావీర్ హరకే
స్వామివారి కొబ్బరికాయ వేలంలో విజయపుర జిల్లాలోని టికోటా గ్రామానికి చెందిన మహావీర్ హరకే టెంకాయను పొందాడు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కూడా స్వామివారి కొబ్బరికాయను రూ.6,50,001 కు గెలుచుకున్నట్లు తెలిపారు. ఈసారి కూడా స్వామివారి ఆశీర్వాదం తమపై ఉండటంతో మళ్లీ కొబ్బరికాయ తమకే దక్కిందని, ఇది దేవుని పట్ల తమకు ఉన్న భక్తి, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. మాలింగరాయ దయతో తమకు ఎంతో మంచి జరిగిందని, సంపద, శ్రేయస్సును భగవంతుడు ప్రసాధించాడని చెప్పారు.
READ ALSO: Rave Party : హైదరాబాద్ గచ్చిబౌలిలో రేవ్ పార్టీ భగ్నం.. డిప్యూటీ తహసీల్దార్ సహా పలువురు