NTV Telugu Site icon

Karnataka Election Results Live Updates: సీఎం ఎవరన్నది అధిష్ఠానమే నిర్ణయిస్తుంది: ఖర్గే

Karnataka

Karnataka

Karnataka Election Results Live Updates: కర్ణాటక రాష్ట్రాన్ని మరో ఐదేళ్ల పాటు పాలించేదెవరో అనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. వచ్చే ఏటా నిర్వహించే లోక్‌సభ ఎన్నికలకు కర్ణాటక ఫలితాలు ఎంతో కీలకమని విశ్లేషణలు ఊపందుకున్న సమయంలో ఫలితం కోసం దేశవ్యాప్త రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. మొత్తం 2,615 మంది భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. ఎన్నికల కౌంటింగ్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల లైవ్‌ అప్‌డేట్స్.. మీకోసం..

 

The liveblog has ended.
  • 13 May 2023 06:21 PM (IST)

    కర్ణాటకలో అధికారం కాంగ్రెస్‌దే.. భారీ విజయం..

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం.. మొత్తం 224 స్థానాల్లో 136 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపు.. బీజేపీ 65, జేడీఎస్‌ 19, ఇతరులు 4 స్థానాల్లో విజయం

  • 13 May 2023 03:27 PM (IST)

    ప్రేమతో విజయం సాధించాం: రాహుల్ గాంధీ.

    కర్ణాటక ఎన్నికల్లో ద్వేషం యొక్క మార్కెట్ బంద్ అయిందని, ప్రేమ దుకాణం తెరుచుకుందని, ప్రేమతో విజయం సాధించామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ ఫలితాలే పునరావృతం అవుతాయని అన్నారు.

  • 13 May 2023 02:26 PM (IST)

    సాయంత్రం బెంగళూరులో సీఎల్పీ సమావేశం

    గెలిచిన ఎమ్మెల్యే బెంగళూరుకు రావాలని కాంగ్రెస్ ఆదేశం.. సాయంత్రం బెంగళూరులో సీఎల్పీ సమావేశం.. సీఎల్పీ నేతను ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు.. సీఎల్పీ సమావేశం తర్వాత గవర్నర్‌ను కలిసే అవకాశం.. సీఎం ఎవరన్నది అధిష్ఠానమే నిర్ణయిస్తుందన్న ఖర్గే.. బసవరాజ్‌ బొమ్మె రాజీనామా వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ చర్యలు

  • 13 May 2023 02:19 PM (IST)

    సెంచరీ కొట్టిన కాంగ్రెస్.. సోనియా, రాహుల్‌కు స్టాలిన్ శుభాకాంక్షలు

    కర్ణాటకలో కాంగ్రెస్ అంచనాలకు మించి దూసుకుపోతోంది. ఏ ఎగ్జిట్‌ పోల్‌ ఊహించని మెజారిటీ దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది. ఫలితాల్లో కాంగ్రెస్ 108 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 51 స్థానాల్లో, జేడీఎస్‌ 16 స్థానాల్లో గెలుపొందింది. ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ 23, బీజేపీ 17, జేడీఎస్‌ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

    కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు నేపథ్యంలో సోనియా, రాహుల్‌లకు తమిళనాడు సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, సిద్ధరామయ్యలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

  • 13 May 2023 01:33 PM (IST)

    రాహుల్‌ పాదయాత్ర కలిసొచ్చింది: సిద్ధరామయ్య

    బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని కాంగ్రెస్ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కర్ణాటక ప్రజలు మార్పు కోరుకున్నారని ఆయన చెప్పారు. బీజేపీ నేతలు ఎన్నికల్లో చాలా ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. 2018 ఎన్నికల్లోనూ 'ఆపరేషన్‌ కమలం' జరిగిందని.. గత ఎన్నికల్లో డబ్బులిచ్చి నేతలను కొనుగోలు చేశారని ఆరోపణలు చేశారు. ఏ పార్టీ దేశాన్ని రక్షిస్తుందో ప్రజలకు తెలుసన్నారు. విద్వేష రాజకీయాలను ప్రజలు ఉపేక్షించరని ఈ సందర్భంగా చెప్పారు. డబ్బుతో ఎన్నికల్లో గెలవాలన్న బీజేపీ శ్రమ ఫలించలేదన్నారు. కాంగ్రెస్‌కు చాలా కీలకమైన ఎన్నికలు ఇవి అని తెలిపిన సిద్ధరామయ్య.. రాహుల్‌ పాదయాత్ర కాంగ్రెస్‌కు ఉపకరించిందన్నారు.

  • 13 May 2023 01:21 PM (IST)

    ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు: డీకే శివకుమార్

    మీడియా సమావేశంలో కేపీసీసీ చీఫ్ శివకుమార్‌ భావోద్వేగానికి గురయ్యారు. కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతిచ్చారని.. మద్దతిచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో కృషిచేశారని.. రాష్ట్రస్థాయి నుంచి బూత్‌ స్థాయి వరకు నేతలు శ్రమించారని ఈ సందర్భంగా చెప్పారు. సమష్టి కృషితో కర్ణాటక ఎన్నికల్లో గెలిచామన్నారు. గాంధీ కుటుంబంపై ప్రజలు విశ్వాసం ఉంచారన్నారు.

  • 13 May 2023 01:17 PM (IST)

    కర్ణాటక ఎన్నికల ఫలితాలు.. 60 దాటిన కాంగ్రెస్ విజయాలు

    కర్ణాటక ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు 60కి పైగా స్థానాలను కాంగ్రెస్ స్థానాల్లో గెలుపొందింది. 62 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా.. 27 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. జేడీఎస్ 6 స్థానాల్లో గెలుపొందింది. మరో రెండు స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ 68, బీజేపీ 39, జేడీఎస్‌ 16, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

  • 13 May 2023 01:05 PM (IST)

    50 దాటిన కాంగ్రెస్ విజయాలు

    కర్ణాటక ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు 50కి పైగా స్థానాలను కాంగ్రెస్ స్థానాల్లో గెలుపొందింది. 52 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా.. 22 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. జేడీఎస్ 5 స్థానాల్లో గెలుపొందింది. మరో రెండు స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ 80, బీజేపీ 43, జేడీఎస్‌ 17, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

  • 13 May 2023 12:58 PM (IST)

    మెజార్టీ మార్కు చేరుకోవడంలో విఫలమయ్యాం: బసవరాజ్‌ బొమ్మై

    మెజార్టీ మార్కు చేరుకోవడంలో విఫలమయ్యామని కర్ణాటక బసవరాజ్‌ బొమ్మై అన్నారు. ఫలితాలు వచ్చాక సమగ్రంగా విశ్లేషించుకుంటామని ఆయన అన్నారు. వివిధ స్థాయిల్లో లోటుపాట్లు, తదితర అంశాలపై విశ్లేషిస్తామన్నారు. లోటుపాట్లు అధిగమించి ముందుకు సాగుతామన్నారు.

  • 13 May 2023 12:55 PM (IST)

    కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్: రేవంత్ రెడ్డి

    జేడీఎస్‌ ఓటమితో బీఆర్‌ఎస్‌ ఓడిపోయినట్టు అని, తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని టీపీసీసీ రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. జోడో యాత్ర ఫలితం కర్ణాటకలో విజయం దిశగా పార్టీ దూసుకెళ్తోందని రేవంత్ పేర్కొన్నారు. గాంధీ భవన్ చేరుకున్న రేవంత్ రెడ్డి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ సమాధానం చెప్పాలని, జేడీఎస్‌ ఇక ఎటు వైపు ఉంటుందో అని ఎద్దేవా చేశారు. బీజేపీతో జతకట్టమని చెప్తారా..? అని ప్రశ్నించారు. అలా అయితే.. ఆయన మైత్రి ఏంటో బయట పడుతుందని రేవంత్‌ పేర్కొన్నారు.

  • 13 May 2023 12:51 PM (IST)

    40 దాటిన కాంగ్రెస్ విజయాలు.. జేడీఎస్ నేత కుమారస్వామి గెలుపు

    కర్ణాటక ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు 40కి పైగా స్థానాలను కాంగ్రెస్ స్థానాల్లో గెలుపొందింది. 43 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా.. 19 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. జేడీఎస్ 4 స్థానాల్లో గెలుపొందింది. మరో రెండు స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ 85, బీజేపీ 47, జేడీఎస్‌ 20, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

    జేడీఎస్‌ నాయకుడు కుమారస్వామి విజయం సాధించారు. ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి ఓటమి పాలయ్యారు.

  • 13 May 2023 12:41 PM (IST)

    కాంగ్రెస్ 35.. బీజేపీ 15.. సీఎం పదవిపై రేపే నిర్ణయం

    కర్ణాటక కాంగ్రెస్ విజయపరంపర కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ దిశగా సాగుతోంది. మధ్యాహ్నం 12.30 నాటికి కాంగ్రెస్ పార్టీ 35 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 15, జేడీఎస్‌ 3 స్థానాల్లో విజయం సాధించగా.. ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ 88, బీజేపీ 55, జేడీఎస్‌ 22, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

    కాంగ్రెస్ పార్టీ రేపు ఉదయం బెంగళూరులో రాష్ట్ర సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. సీఎల్పీ భేటీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది.

     

  • 13 May 2023 12:32 PM (IST)

    మాజీ సీఎం జగదీశ్ షెట్టర్, బీజేపీ అభ్యర్థి శ్రీరాములు ఓటమి

    హుబ్లీ ధార్వాడ్‌ సెంట్రల్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన జగదీశ్‌ షెట్టర్ ఓటమి పాలయ్యారు. మొదటి నుంచి వెనకంజలోనే ఉన్న ఆయన చివరికి ఓడిపోయారు. మాజీ ముఖ్యమంత్రి అయిన షెట్టర్‌కు బీజేపీ టికెట్‌ నిరాకరించడంతో కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగారు.

    ఇదిలా ఉండగా.. బళ్లారి రూరల్‌ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి శ్రీరాములు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నాగేంద్ర ఆయనపై గెలుపొందారు. శ్రీరాములు గతంలో 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు.

  • 13 May 2023 12:24 PM (IST)

    దూసుకెళ్తున్న కాంగ్రెస్.. 29 స్థానాల్లో విజయభేరి

    ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు 29 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 11 స్థానాల్లో గెలుపొందగా.. జేడీఎస్‌ ఒక స్థానంలో విజయం సాధించింది. స్వతంత్రుల్లో ఒకరు విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ 93, బీజేపీ 58, జేడీఎస్‌ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

  • 13 May 2023 12:15 PM (IST)

    సీఎం బొమ్మై విజయం.. కాంగ్రెస్‌ 19, బీజేపీ 6 స్థానాలు కైవసం

    కర్ణాటక ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి బసవరాజ్ బొమ్మై.. షిగ్గావ్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు

    కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చుతోంది. ఇప్పటివరు 19 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ 6 స్థానాల్లో గెలుపొందగా.. జేడీఎస్‌ ఒక స్థానంలో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ 105, బీజేపీ 64, జేడీఎస్‌ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

  • 13 May 2023 12:09 PM (IST)

    ఓట్లలో కాంగ్రెస్‌కే 42.9 శాతం..

    ఇప్పటి వరకు లెక్కించిన ఓట్ల ప్రకారం 42.9 శాతం ఓట్లతో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. 36.1 ఓట్ల శాతంతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. 13.2 శాతం ఓటింగ్‌ శాతంతో జేడీఎస్ మూడో స్థానంలో ఉంది.

    ఇదిలా ఉండగా.. ఇప్పటికే కాంగ్రెస్ 17 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 5 స్థానాల్లో, జేడీఎస్‌ ఒక్క స్థానంలో గెలుపొందాయి. ఇక కాంగ్రెస్ 105, బీజేపీ 64, జేడీఎస్‌ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

  • 13 May 2023 11:49 AM (IST)

    కనకపురాలో డీకే శివకుమార్ గెలుపు.. 15 స్థానాలు కాంగ్రెస్ కైవసం

    కర్ణాటకలో కాంగ్రెస్ విజయపరంపర కొనసాగుతోంది. కనకపురా నుంచి ఎన్నికల బరిలోకి దిగిన కేపీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ గెలుపొందారు. డీకే శివకుమార్‌ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇప్పటికే కాంగ్రెస్ 15 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 4, జేడీఎస్‌ ఒక్క స్థానంలో గెలుపొందాయి. ఇక కాంగ్రెస్ 108, బీజేపీ 64, జేడీఎస్‌ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

  • 13 May 2023 11:42 AM (IST)

    కాంగ్రెస్ హవా మొదలు.. మూడు స్థానాల్లో విజయం

    కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ విజయపరంపర మొదలైంది. మూడు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ, జేడీఎస్‌లు ఒక్కో స్థానంలో గెలుపొందాయి. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ 117, బీజేపీ 68, జేడీఎస్ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

    *చల్లకెరె- రఘుమూర్తి(కాంగ్రెస్)
    *మొలకల్మూరు-గోపాలకృష్ణ(కాంగ్రెస్)
    *హరియూర్‌ - సుధాకర్(కాంగ్రెస్)
    *ఎల్లపౌర- శివరామ్(బీజేపీ)
    *హసన్‌- స్వరూప్(జేడీఎస్)

  • 13 May 2023 11:33 AM (IST)

    కర్ణాటక ఎన్నికల కౌంటింగ్.. ఖాతా తెరిచిన మూడు పార్టీలు

    కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఫలితాల్లో బీజేపీ, కర్ణాటక, జేడీఎస్‌ పార్టీలు తమ ఖాతాను తెరిచాయి. మూడు పార్టీలు ఒక్కో స్థానంలో గెలుపొందాయి. ఉదయం 11.25 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ 120 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 76 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. జేడీఎస్ 26, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

    కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మణ్‌ సవాదీ విజయం సాధించారు. 9వేల మెజార్టీతో లక్ష్మణ్‌ సవాదీ గెలుపొందారు. ఇటీవల లక్ష్మణ్ సవాదీ బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.

  • 13 May 2023 11:22 AM (IST)

    కాంగ్రెస్‌కు ఎవరి మద్దతు అవసరం లేదు: సిద్ధరామయ్య

    కర్ణాటకలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. 120 స్థానాలకు పైగా గెలుస్తామని కాంగ్రెస్ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. బీజేపీపై ప్రజలు విసిగిపోయారని.. సంపూర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కు ఎవరి మద్దతు అవసరం లేదన్నారు. కర్ణాటకలో మత రాజకీయాలు పని చేయలేదని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

  • 13 May 2023 11:16 AM (IST)

    కుమారస్వామితో బీజేపీ నేతల భేటీ?

    మరోసారి జేడీఎస్‌ పాత్ర కీలకం కానుంది. కర్ణాటకలో ఓ వైపు ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా.. మరోవైపు పొత్తులు, ఎత్తుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే 30 స్థానాల్లో జేడీఎస్‌ ఆధిక్యంలో ఉండగా.. మరోసారి చక్రం తిప్పేందుకు కుమారస్వామి సిద్ధమవుతున్నారు. ఆయనతో బీజేపీ అగ్రనేతలు మంతనాలు జరుపుతున్నారు. జేడీఎస్‌ చీఫ్‌ కుమారస్వామితో ఓ హోటల్‌లో కొందరు బీజేపీ నేతలు భేటీ అయినట్లు సమాచారం.

    ఇదిలా ఉండగా కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. కోస్టల్‌ కర్ణాటక, బెంగుళూరులో బీజేపీ ఆధిక్యం కొనసాగుతుండగా.. హైదరాబాద్‌ కర్ణాటకలో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది. ఓల్డ్‌ మైసూర్లో జేడీఎస్‌కు కాంగ్రెస్‌ గండికొట్టింది. ఓల్డ్‌ మైసూర్‌లో మూడో స్థానంలో బీజేపీ ఉండడం గమనార్హం. ఉత్తర కర్ణాటకలో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది.

  • 13 May 2023 10:57 AM (IST)

    బళ్ళారిలో బీజేపీ ఓట్లు చీల్చిన గాలి పార్టీ

    *బళ్ళారిలో బీజేపీ ఓట్లు చీల్చిన గాలి జనార్దన్‌ రెడ్డికి చెందిన కేఆర్‌పీపీ పార్టీ
    *కేఆర్‌పీపీ పార్టీలో గాలి జనార్దన్‌ రెడ్డి ఒక్కడికే ఆధిక్యం

  • 13 May 2023 10:51 AM (IST)

    రెండు పార్టీలను టెన్షన్ పెడుతున్న 40 స్థానాలు

    *కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌దే పైచేయి
    *రెండు పార్టీలను టెన్షన్ పెడుతున్న 40 స్థానాలు
    *దాదాపు 40 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య వెయ్యిలోపే ఓట్ల వ్యత్యాసం
    *నెమ్మదిగా పుంజుకుంటున్న జేడీఎస్

    *30 స్థానాల్లో జేడీఎస్‌ ఆధిక్యం

  • 13 May 2023 10:45 AM (IST)

    దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

    224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్కు చేరువైనందున న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు డ్యాన్సులు చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.

  • 13 May 2023 10:40 AM (IST)

    ఫలితాలు పూర్తయ్యాక అభ్యర్థులు బెంగళూరుకు రావాలి: కేపీసీసీ

    *ఖర్గే నివాసంలో రణదీప్‌సింగ్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ భేటీ
    *కాంగ్రెస్ అభ్యర్థులకు హైకమాండ్ ఆదేశాలు
    *ఫలితాలు పూర్తయ్యాక అభ్యర్థులు బెంగళూరుకు రావాలన్న కేపీసీసీ

  • 13 May 2023 10:13 AM (IST)

    115 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ

    ఉదయం 10.20 గంటల వరకు 115 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అధికార బీజేపీ 79 స్థానాల్లో, జేడీఎస్ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 5 స్థానంలో ముందంజలో ఉన్నారు.

  • 13 May 2023 10:08 AM (IST)

    రేపు మధ్యాహ్నం బెంగళూరులో కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్

    *దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు
    *రేపు మధ్యాహ్నం బెంగళూరులో కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్
    *గెలిచిన ఎమ్మెల్యేలందరూ బెంగళూరుకు రావాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశం

  • 13 May 2023 10:03 AM (IST)

    ఫలితాల్లో వెనుకబడ్డ 9 మంది మంత్రులు

    *తాజా ట్రెండ్స్‌లో మ్యాజిక్ ఫిగర్‌ దాటిన కాంగ్రెస్
    *ఫలితాల్లో వెనుకబడ్డ 9 మంది మంత్రులు
    *కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగుతున్న కాంగ్రెస్ హవా
    *బెంగళూరు రీజియన్‌లో బీజేపీ ఆధిక్యం

     

  • 13 May 2023 09:48 AM (IST)

    ఆధిక్యంలో గాలి జనార్దన్‌ రెడ్డి దంపతులు

    *గంగావతి స్థానంలో గాలి జనార్దన్ రెడ్డి ఆధిక్యం
    *బళ్లారి పట్టణంలో గాలి లక్ష్మీ అరుణ ఆధిక్యం
    *వెనుకంజలో 8 మంది మంత్రులు
    *వెనుకంజలో మంత్రులు సోమన్న, అశోక్, సుధాకర్, శ్రీరాములు, జార్క్ హోలి
    *బళ్లారి రూరల్ స్థానంలో శ్రీరాములు (బీజేపీ) వెనుకంజ
    *చిక్కబళ్లాపూర్ స్థానంలో సుధాకర్ (బీజేపీ) వెనుకంజ

    *హుబ్బళి ధార్వాడ్ సెంట్రల్ జగదీశ్ షెట్టర్ (కాంగ్రెస్) వెనుకంజ.. రౌండ్ రౌండ్‌కు మారుతున్న ఫలితాలు

    *చిక్కమగళూరు స్థానంలో సి.టి.రవి (బీజేపీ) ఆధిక్యం
    *జేడీఎస్‌కకు షాకిస్తున్న ఓటర్లు
    *బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు మారిన మంత్రి సవాదీ ముందంజ

  • 13 May 2023 09:36 AM (IST)

    ఓల్డ్‌ మైసూర్‌, ముంబై కర్ణాటకలో కాంగ్రెస్‌ ఆధిక్యం

    *హుబ్లీ థార్వాడ్‌ సెంట్రల్‌లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ

    *ఓల్డ్‌ మైసూర్‌, ముంబై కర్ణాటకలో కాంగ్రెస్‌ ఆధిక్యం

    *సెంట్రల్ కర్ణాటక, కోస్టల్‌ కర్ణాటకలో బీజేపీ స్వల్ప ఆధిక్యం

  • 13 May 2023 09:17 AM (IST)

    తొలిరౌండ్ పూర్తయ్యే సరికి మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్

    తొలిరౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. బీజేపీకి  చెందిన 8 మంత్రులు వెనకంజలో ఉన్నారు.  కాంగ్రెస్ ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ దాటింది. 119 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా.. 83 స్థానాల్లో బీజేపీ, 18 స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.

     

  • 13 May 2023 09:02 AM (IST)

    110 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ

    ఉదయం 9 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. 110 స్థానాల్లో కాంగ్రెస్ ముందజలో ఉండగా.. బీజేపీ 90, జేడీఎస్‌ 22, ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

    *కనకపురంలో డీకే శివకుమార్‌, బళ్లారి రూరల్‌లో శ్రీరాములు, వరుణలో సిద్ధరామయ్య, గాంధీనగర్‌లో దినేష్‌ గుండూరావు ముందంజ

    *హోలి నరసిపూర్‌లో హెచ్‌డీ రేవణ్ణ ముందంజ

    *చిత్తాపూర్‌లో ప్రియాంక్‌ ఖర్గే
    *గంగావతిలో గాలి జనార్థన్ రెడ్డి ఆధిక్యం
    *రామనగరలో నిఖిల్ కుమారస్వామి వెనుకంజ
    *చెన్నపట్టణలో కుమారస్వామి వెనకంజ
    *షిగ్గావ్‌లో బసవరాజ్‌ బొమ్మై ముందంజ
    *శిఖారిపురలో బీవై విజయేంద్ర ముందంజ
    *బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డి భార్య అరుణ(కేఆర్‌పీపీ) ముందంజ
    *హుబ్లీ ధార్వాడ్‌లో బీజేపీ రెబల్‌ నేత జగదీష్‌శెట్టర్‌ ముందంజ

    *చిక్‌మగుళూర్‌లో సీటీ రవి(బీజేపీ) ముందంజ
    *శిఖారిపురలో బీవై విజయేంద్ర (బీజేపీ) ముందంజ

     

  • 13 May 2023 08:55 AM (IST)

    పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం

    పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఉదయం 8.40 గంటల వరకు ఫలితాల ప్రకారం కాంగ్రెస్ ఆధిక్యం 50 దాటింది. ఆ సమయానికి బీజేపీ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 54, జేడీఎస్‌ 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

  • 13 May 2023 08:16 AM (IST)

    పూజలు చేసిన ముఖ్యమంత్రి

    కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే హుబ్బళ్లిలోని హనుమాన్ ఆలయాన్ని సీఎం బసవరాజ్ బొమ్మై సందర్శించారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

     

     

  • 13 May 2023 08:03 AM (IST)

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ షురూ..

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల​కు ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్‌, బ్యాలెట్లు వయోవృద్ధుల ఓట్లు లెక్కిస్తారు. ఈ సారి వయో వృద్ధులకు ఇంట్లో నుంచే ఓటు విధానం కల్పించారు. ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. మధ్యాహ్నం కల్లా తుది ఫలితాలపై స్పష్టత రానుంది. మొత్తం 2,615 మంది అభ్యర్థుల తలరాత ఏమిటో తేలిపోనుంది.

     

  • 13 May 2023 07:33 AM (IST)

    మరో 2-3 గంటల్లో తేలిపోతుంది: హెచ్‌డీ కుమారస్వామి

    కర్ణాటకలో ఎన్నికల ఫలితం మరో 2-3 గంటల్లో తేలిపోతుందని జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. రెండు జాతీయ పార్టీలు భారీ స్కోరు సాధిస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయన్నారు. సర్వేలు జేడీ(ఎస్)కి 30-32 సీట్లు ఇచ్చాయని తెలిపారు. పొత్తుల గురించి తమను ఇంతవరకు ఎవరూ కలవలేదని ఆయన స్పష్టం చేశారు. జేడీఎస్‌ చిన్న పార్టీ అని, తాము అభివృద్ధిని ఆశిస్తున్నామన్నారు.

     

  • 13 May 2023 07:29 AM (IST)

    భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం

    మే 10న జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల 224 స్థానాలకు జరగనున్న ఓట్ల లెక్కింపునకు ముందు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాల, సెయింట్ జోసెఫ్ కళాశాల కౌంటింగ్ కేంద్రాల నుండి దృశ్యాలు.

     

Show comments