కర్ణాటక రాష్ట్రాన్ని మరో ఐదేళ్ల పాటు పాలించేదెవరో అనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. గత ఎన్నికల్లో ఏ పార్టీని పూర్తిగా విశ్వసించని కన్నడ ప్రజలు ఈ సారి మరో ఐదేళ్లకు ఎవరి చేతిలో పగ్గాలు పెడతారో నేడు తెలుస్తుంది. వచ్చే ఏటా నిర్వహించే లోక్‌సభ ఎన్నికలకు కర్ణాటక ఫలితాలు ఎంతో కీలకమని విశ్లేషణలు ఊపందుకున్న సమయంలో ఫలితం కోసం దేశవ్యాప్త రాజకీయ పార్టీలు…