Kantara Chapter 1: 2022లో సంచలనం సృష్టించిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తున్న ‘కాంతార చాప్టర్ 1’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయనే ప్రధాన పాత్ర పోషించారు. ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 2న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, ఈ సినిమా ట్రైలర్‌ను ప్రభాస్ విడుదల చేశారు. ట్రైలర్‌లో రిషబ్‌శెట్టి తన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. ఆయన భయపెట్టే లుక్‌లో కనిపించి సినిమాపై అభిమానులకు మరింత ఆసక్తిని పెంచారు. హీరోయిన్ రుక్మిణి వసంత్ మహారాణి పాత్రలో కనిపించి మెప్పించగా.. సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అద్భుతంగా ఉన్నట్లు అర్థమవుతుంది. గూస్ బంప్స్ వచ్చే విధంగా రూపొందించిన ట్రైలర్.. సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.
గూగుల్ స్పెషల్ యానిమేషన్.. Solar Eclipse అని సెర్చ్ చేశారో..!
2022లో విడుదలైన కాంతార సినిమా కేవలం రూ. 14 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ అద్భుత విజయం తర్వాతే మేకర్స్ ఈ సినిమాకు ప్రీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఈ ప్రీక్వెల్‌కు ‘కాంతార చాప్టర్ 1’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు మూడేళ్లుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. చుడాలిమరి మరోసారి రిషబ్ శెట్టి తన నటనతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో.
200MP టెలిఫోటో కెమెరా, 7,000mAh బ్యాటరీలతో వచ్చేస్తున్న Realme GT 8 Series!