కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యహరించిన కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే భారీ బడ్జెట్ తో ఈ సినియాను నిర్మించింది. దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన కాంతార అనేక రికార్డులు బద్దలు కొడుతూ వరల్డ్ వైడ్ గా రూ. 1000 కోట్ల మార్క్ ను అందుకుని కన్నడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే ‘
థియేటర్స్ లో సెన్సషన్ హిట్ గా నిలిచిన కాంతార చాప్టర్ 1 ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది. నేటి నుండి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది అమెజాన్. ఈ ఏడాది అక్టోబరు 2 న దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా నాలుగు వారల థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తోంది అమెజాన్ ప్రైమ్. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ స్ట్రీమింగ్ తీసుకువచ్చింది. థియేటర్ లో సూపర్ హిట్ అయిన కాంతార చాప్టర్ ఓటీటీలో ఎలాంటి వ్యూస్ రాబడుతుందో చూడాలి.