Uttarpradesh : ప్రియుడి కోసం కుటుంబ సభ్యులకు నిద్రమాత్రలు ఇచ్చిన యువతి.. ఈ తర్వాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ పరిమళ ద్రవ్యాల సువాసనకు ప్రసిద్ధి. అయితే ఈ కన్నౌజ్ ప్రస్తుతం మరో విషయంలో వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడ 17 ఏళ్ల అమ్మాయి తన ప్రేమికుడి ఆదేశాల మేరకు తన కుటుంబాన్ని మొత్తం చంపాలని ప్లాన్ చేసింది. సోమవారం రాత్రి భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. దీంతో కుటుంబసభ్యులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆ తర్వాత ఆమె తన ప్రేమికుడిని ఇంటికి ఆహ్వానించింది. ప్రియుడి సాయంతో ఆ యువతి మొదట పదునైన బ్లేడుతో తండ్రి గొంతు కోసింది. అనంతరం సోదరుడిపై సుత్తితో దాడి చేశారు.
దీంతో దెబ్బలకు తాళలేక సోదరుడు కళ్లు తెరిచాడు. నొప్పి భరించలేక అరవడం మొదలుపెట్టాడు. దీంతో చుట్టుపక్కల వారు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ కారణంగా అమ్మాయి.. ఆమె ప్రేమికుడిని పట్టుకున్నారు. గాయపడిన తండ్రిని గ్రామస్థులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన చిబ్రమౌ కొత్వాలిలోని ఘిసువాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. విషయం పోలీసులకు చేరడంతో పోలీసులు యువతితో పాటు తన ప్రేమికుడిని అదుపులోకి తీసుకున్నారు. యువతిని పోలీసులు తమ స్టైల్లో విచారించగా హత్య చేసినట్లు అంగీకరించింది. కుటుంబాన్ని హత్య చేసేందుకు ఎందుకు కుట్ర పన్నారో తెలిపింది. బాలిక తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె తండ్రి 50 ఏళ్ల అజయ్ పాల్ రాజ్‌పుత్ గ్రామాభివృద్ధి అధికారి (కార్యదర్శి)గా పనిచేస్తున్నారు.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
Read Also:Hema: రెండ్రోజుల్లో అందరి సంగతి తేలుస్తా.. రేవ్ పార్టీపై హేమ కీలక వ్యాఖ్యలు
యువతి మాట్లాడుతూ, ‘నేను కాకుండా కుటుంబంలో ఇద్దరు సోదరులు, తల్లి ఉన్నారు. తల్లి పేరు మోని దేవి, అన్నయ్య సిద్ధార్థ్ (18), నాకంటే చిన్నవాడు అమన్ (14) ఉన్నారు. హిమాన్షు యాదవ్ అనే అబ్బాయితో నాకు ఎఫైర్ ఉంది. కానీ మా నాన్నకు ఇది అస్సలు నచ్చలేదు. ఈ విషయంలో నన్ను తిట్టాడు కూడా. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా చేశారు. అతి కష్టం మీద హిమాన్షుని కలిసినప్పుడు విషయం మొత్తం చెప్పాను. అప్పుడు హిమాన్షు నాకు ఈ ఆలోచన ఇచ్చాడు. మా ప్రేమకు నా కుటుంబం అడ్డుగా మారితే కుటుంబమే నాశనం కావాలి అని అన్నారు.
అందుకే మా కుటుంబాన్ని హతమార్చేందుకు మేం పూర్తి ప్లాన్ చేశామని నిందితురాలు తెలిపింది. సోమవారం హత్యకు ఫిక్స్ అయ్యాను. రాత్రి భోజనంలో నిద్ర మందు కలిపి ఇచ్చాను. అందరూ రాత్రి భోజనం చేసి అపస్మారక స్థితికి చేరుకున్నారు. నేను నా కుక్క ఆహారంలో కూడా నిద్రమాత్రలు కలిపాను. మేం హత్య చేసేటప్పుడు అరవకుండా ఉంటుందని అలా చేశాను. అప్పటికి రాత్రి రెండు గంటలు. హిమాన్షుకి ఫోన్ చేశాను. ముందుగా పదునైన బ్లేడుతో తండ్రి గొంతు కోశాను. ఆ తర్వాత అన్నయ్య గదిలోకి వెళ్లాం. అతనిపై సుత్తితో దాడి చేశాం. కానీ అతను నిద్ర ఎలా పోగొట్టుకున్నాడో తెలియదు. నిద్రలేచి అరవడం మొదలుపెట్టాడు. పట్టుబడతామని అనుకున్నాం. దాంతో మేమిద్దరం అక్కడి నుంచి పారిపోవడం మొదలుపెట్టాం. అయితే గ్రామస్తులు మమ్మల్ని పట్టుకున్నారు.’ అంటూ పూసగుచ్చినట్లు చేసిన నేరం గురించి పోలీసులకు తెలిపింది.
Read Also:Janhvi Kapoor: ‘దేవర’లో తన పాత్రను రివీల్ చేసిన జాన్వీ కపూర్!
గాయపడిన సిద్ధార్థ్‌ను గ్రామస్థులు ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఈ కేసులో ఇద్దరు నిందితుల విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, సంఘటన జరిగిన మరుసటి రోజు పెంపుడు కుక్క కూడా స్పృహలోకి వచ్చింది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!