టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు కు చాలా కాలంగా హిట్ సినిమా పలకరించలేదు.. చాలా కాలం గ్యాప్ తీసుకొని సరికొత్త కథతో ప్రస్తుతం కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు.. భక్త కన్నప్ప సినిమా మంచు విష్ణు కలల ప్రాజెక్టు అన్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు.. గత ఏడాది ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప పాత్రలో విష్ణు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ హిస్టారికల్ సోషియో ఫాంటసీ మూవీలో మధుబాల, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ వంటి ప్రముఖులు నటిస్తున్నారు.. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ప్రముఖ పాత్రలో నటిస్తున్నారన్న విషయం తెలిసిందే.. శివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు.. ఈ సినిమాలో కేవలం పది నిమిషాలు మాత్రమే డార్లింగ్ కనిపిస్తాడట.. అయితే ఈ సినిమాలో కనిపించడానికి ప్రభాస్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తుంది..
అయితే ప్రభాస్ కు జోడిగా ఎవరు నటిస్తారన్న వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి.. ప్రభాస్‌కు జోడిగా కంగనా రనౌత్ పార్వతి పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఇప్పుడు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ప్రభాస్, కంగనా ఏక్ నిరంజన్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక పాన్ ఇండియా స్థాయిలో భారీగా వస్తోన్న ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు… ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను మాత్రమే రిలీజ్ చేశారు..