Kanguva : అన్ స్టాపబుల్ గా ప్రమోషన్లు చేస్తున్న కంగువ టీం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా.. డైరెక్టర్ శివ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా ‘కంగువా’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కావాల్సిన కంగువా.. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వేట్టయన్’ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కంగువా చిత్రాన్ని నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కంగువా ద్వారా బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, దిశా పటానీలు కోలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. కిచ్చా సుదీప్, యోగిబాబు, జగపతిబాబు, నటరాజన్ సుబ్రమణ్యంలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇందులో సూర్య మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. తెలుగు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మొదటిసారి తమిళంలో నిర్మిస్తున్న మూవీ కావడంతో మన దగ్గర కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
Read Also: Israel Hezbollah War: ఇజ్రాయెల్ మిలిటరీ కంపెనీపై హెజ్బొల్లా దాడి.. తిప్పికొట్టిన ఐడీఎఫ్
Also Read
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
కంగువా సినిమా మీద అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. అలానే తమిళంలో రూ.1000కోట్లు కలెక్ట్ చేయగల సత్తా ఉన్న సినిమాగా అంచనా వేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేస్తూ చిత్ర బృందం ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తమ సినిమాను తెలుగులో ప్రమోట్ చేసేందుకు ‘కంగువా’ టీమ్ హైదరాబాద్ రానుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 24న ఓ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసింది చిత్రయూనిట్. అయితే, దీంతో పాటు స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్-4’లోనూ ‘కంగువా’ టీమ్ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూట్ అక్టోబర్ 24న జరగనున్నట్లు సమాచారం.
Read Also:Team India: ఆసియా కప్‌లో టీమిండియా వరుస విజయాలు.. సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్‌తో ఢీ!
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ శివ కంగువా రన్ టైం బయటపెట్టేశాడు. ఈ సినిమాలో ఓల్డ్ పోర్షన్ రెండు గంటలు ఉంటుందట. అంటే కంగువ పాత్రలో సూర్య రెండు గంటల పాటు కనిపించనున్నాడు. ఇక న్యూ పోర్షన్ దాదాపు 25 నిమిషాల పాటు ఉంటుంది. టైటిల్స్ నిడివి పక్కన పెడితే ఈ సినిమా దాదాపు రెండు గంటల 25 నిమిషాల పాటు ఉండబోతుందని తెలుస్తుంది. ఇటీవల కాలంలో చాలా సినిమాల రన్ టైం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సినిమా రన్ టైం టు అవర్స్ 25 మినిట్స్ అంటే ఇటీవల సినిమాలతో పోలిస్తే తక్కువే. ఇది సినిమాకు ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!