Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Morphing Controversy: సోషల్ మీడియాలో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ జరుగుతున్న మార్ఫింగ్, అసభ్యకర కంటెంట్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో పెను దుమారం రేపుతోంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్లకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన మార్ఫింగ్, డీఫేమింగ్ వీడియోలపై సినీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు నటీనటులు ఎవరికి వారు వ్యక్తిగతంగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం, ట్వీట్లు పెట్టడం లాంటివి చేస్తూ వచ్చారు. అయితే ఈ సమస్య తీవ్రత శృతిమించడంతో మొత్తం చిత్ర పరిశ్రమ తరఫున ఒక సామూహిక పోరాటానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కీలక విషయాలను వెల్లడించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం అత్యంత హేయంగా, మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నటీనటులు విడివిడిగా స్పందిస్తున్నప్పటికీ, దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలంటే పరిశ్రమ మొత్తం ఉమ్మడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై సాగుతున్న ఈ ట్రోలింగ్, మార్ఫింగ్ కంటెంట్‌ను అరికట్టడానికి బలమైన చట్టపరమైన రక్షణ అవసరమని ఇండస్ట్రీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను నేరుగా కలవాలని చిత్ర పరిశ్రమ పెద్దలు నిర్ణయించుకున్నట్లు నాగవంశీ తెలిపారు. పవన్ కళ్యాణ్‌ను కలవడానికి టైం తీసుకుని, సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఈ సైబర్ దాడులు, మార్ఫింగ్ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇలాంటి వికృత చేష్టలకు చెక్ పెట్టేలా కఠినమైన చట్టాలు, శాశ్వత నియంత్రణ తీసుకురావడమే లక్ష్యంగా పరిశ్రమ అడుగులు వేస్తోందని ఆయన వివరించారు. సోషల్ మీడియా ముసుగులో హద్దులు దాటుతున్న వికృత పోకడలకు ఇకనైనా ఫుల్స్టాప్ పడాలంటే రాజకీయంగా, అధికారికంగా ప్రభుత్వం నుంచే బలమైన నిర్ణయం రావాలని టాలీవుడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.
Also Read
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
తాజావార్తలు
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..