NTV Telugu Site icon

Kanguva : అన్ స్టాపబుల్ గా ప్రమోషన్లు చేస్తున్న కంగువ టీం

New Project 2024 10 24t080708.076

New Project 2024 10 24t080708.076

Kanguva : కోలీవుడ్‌ స్టార్ హీరో సూర్య హీరోగా.. డైరెక్టర్ శివ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా ‘కంగువా’. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల కావాల్సిన కంగువా.. సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ‘వేట్టయన్‌’ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కంగువా చిత్రాన్ని నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కంగువా ద్వారా బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, దిశా పటానీలు కోలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. కిచ్చా సుదీప్‌, యోగిబాబు, జగపతిబాబు, నటరాజన్ సుబ్రమణ్యంలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇందులో సూర్య మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. తెలుగు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మొదటిసారి తమిళంలో నిర్మిస్తున్న మూవీ కావడంతో మన దగ్గర కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

Read Also: Israel Hezbollah War: ఇజ్రాయెల్ మిలిటరీ కంపెనీపై హెజ్‌బొల్లా దాడి.. తిప్పికొట్టిన ఐడీఎఫ్

కంగువా సినిమా మీద అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. అలానే తమిళంలో రూ.1000కోట్లు కలెక్ట్ చేయగల సత్తా ఉన్న సినిమాగా అంచనా వేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేస్తూ చిత్ర బృందం ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తమ సినిమాను తెలుగులో ప్రమోట్ చేసేందుకు ‘కంగువా’ టీమ్ హైదరాబాద్ రానుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 24న ఓ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసింది చిత్రయూనిట్. అయితే, దీంతో పాటు స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్-4’లోనూ ‘కంగువా’ టీమ్ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూట్ అక్టోబర్ 24న జరగనున్నట్లు సమాచారం.

Read Also:Team India: ఆసియా కప్‌లో టీమిండియా వరుస విజయాలు.. సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్‌తో ఢీ!

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ శివ కంగువా రన్ టైం బయటపెట్టేశాడు. ఈ సినిమాలో ఓల్డ్ పోర్షన్ రెండు గంటలు ఉంటుందట. అంటే కంగువ పాత్రలో సూర్య రెండు గంటల పాటు కనిపించనున్నాడు. ఇక న్యూ పోర్షన్ దాదాపు 25 నిమిషాల పాటు ఉంటుంది. టైటిల్స్ నిడివి పక్కన పెడితే ఈ సినిమా దాదాపు రెండు గంటల 25 నిమిషాల పాటు ఉండబోతుందని తెలుస్తుంది. ఇటీవల కాలంలో చాలా సినిమాల రన్ టైం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సినిమా రన్ టైం టు అవర్స్ 25 మినిట్స్ అంటే ఇటీవల సినిమాలతో పోలిస్తే తక్కువే. ఇది సినిమాకు ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.