NTV Telugu Site icon

Emergency movie: కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమాకి గ్రీన్ సిగ్నల్.. రిలీజ్ ఎప్పుడంటే?

Kangana Ranaut

Kangana Ranaut

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ చిట్ లభించింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కంగనా సినిమా చాలా కాలంగా వివాదాల్లో కూరుకుపోయింది. అయితే ఇప్పుడు విడుదలకు చిక్కుముళ్లు వీడాయి. తాజాగా తన సినిమా సెన్సార్ సర్టిఫికేట్ పొందిందని నటి తెలియజేసింది. అయితే ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. నటి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ ను పంచుకుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది. మీ సహనం, మద్దతుకు కృతజ్ఞురాలినని పోస్ట్‌లో పేర్కొంది.

READ MORE: Bhakthi TV Koti Deepotsavam 2024 : భక్తి టీవీ కోటి దీపోత్సవం.. నవంబర్‌ 9 నుంచి 25 వరకు..

ఎమర్జెన్సీపై వివాదం ఏమిటి?
కంగనా చిత్రం ముందుగా 2024 సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. అయితే సిక్కు సంస్థల నిరసనలతో విడుదల వాయిదా పడింది. ఈ చిత్రంలో తమ సమాజం గురించి తప్పుగా చూయించారని.. సిక్కులు ఆరోపిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఆగస్ట్ 14న విడుదలైంది. అప్పటి నుంచి సినిమాపై వివాదం తలెత్తింది. పంజాబ్‌లో ఈ చిత్రానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. దానిని నిషేధించాలని డిమాండ్ చేశారు. సీబీఎఫ్‌సీ ఇంతకుముందు సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చింది. కానీ సిక్కు సంఘం యొక్క ఆగ్రహం తెరపైకి రావడంతో ఈ వివాదం.. మధ్యప్రదేశ్ హైకోర్టుకు చేరుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మేకర్స్కు ఇంకా సర్టిఫికేట్ నిలిపేసింది. సర్టిఫికేట్ ఇచ్చే ముందు సిక్కుల అభ్యంతరాలపై దృష్టి పెట్టాలని మధ్యప్రదేశ్ హైకోర్టు సీబీఎఫ్‌సీని ఆదేశించింది.

READ MORE: Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్‌ని అప్పగించాలని కోరాం, కెనడా స్పందించలేదు: భారత్..

కంగనా సినిమాలో మార్పులు..
సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో మేకర్స్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సీబీఎఫ్‌సీ రివైజింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇది చిత్రంలో కంగనాకు మార్పులను సూచించింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ పాస్ కావడానికి షరతులు పెట్టినట్లు సమాచారం. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది. వీటిలో మార్పులు చేయాలని మేకర్స్‌ని ఆదేశించారు. చారిత్రక అంశాలపై డిస్‌క్లైమర్లు పెట్టాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ఎమర్జెన్సీ సినిమాలో కంగనా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది. నటనతో పాటు ఈ చిత్రానికి దర్శకత్వం వహించి, నిర్మించింది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి వంటి పలువురు నటీనటులు కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.