Kangana Ranaut : ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్. మనసులో ఉన్నది ఏదైనా సరే ఓపెన్‌గా మాట్లాడుతుంది. అక్కడున్నది ఎవరినైనా సరే ధీటుగా జవాబిస్తుంది. ఇలా ఈ భామ అనేక వివాదాలకు కేరాఫ్ గా నిలిచింది. కమర్షియల్ చిత్రాలతో పాటు ఈ భామ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే కెరీర్ ప్రారంభంలో సౌత్ సినిమాలలో కూడా నటించింది కంగనా. తెలుగులో ఆమెచే సిన మొదటి సినిమా `ఏక్ నిరంజన్`.ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించాడు., పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2009లో విడుదలైంది. ఇందులో హీరోయిన్‌గా కంగనా రనౌత్ నటించింది. ఈ సినిమాతోనే కంగనా టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో మరో సినిమా చేయలేదు. తను చేసిన తొలి చిత్రమే నిరాశ పరచడంతో ఈ భామ మళ్ళీ టాలీవుడ్ వైపు చూడలేదు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో మాత్రం మంచి మెమొరీస్ ఉన్నాయని చెప్పింది కంగనా.
తాజాగా ఆ విషయాలపై ఓపెన్ అయ్యింది కంగనా రనౌత్.`ఏక్ నిరంజన్` సినిమా షూటింగ్ సెట్‌లో ప్రభాస్‌తో చాలా సరదాగా గడిపినట్టు ఆమె తెలిపింది. అప్పుడు ప్రభాస్, నేను చాలా యంగ్ ఏజ్‌లో ఉన్నామని అల్లరి చేస్తూ ఉండేవాల్లమని ఆమె చెప్పింది. సెట్‌లో చాలా ఛిల్ అయ్యామని, అంతేకాదు ఒకరినొకరు సెట్‌లో టీజింగ్ కూడా చేసుకున్నట్టు తెలిపింది కంగనా రనౌత్. అప్పుడు చాలా యంగ్‌గా ఉన్నామని, ఇప్పుడు చాలా మారిపోయినట్టు ఆమె తెలిపింది. ప్రభాస్ పూర్తిగా కొత్తగా అయిపోయారు.పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారని వెల్లడించారు.ఈ సందర్భంగా `ఏక్ నిరంజన్ 2` సినిమా చేస్తే.. అందులో మీరు నటించడానికి సిద్ధమేనా అనే ప్రశ్నకి కంగనా స్పందించింది. నేను సిద్ధంగానే ఉంటానని ఆమె వెల్లడించింది. సౌత్‌లో నటించేందుకు నేను ఎంతో ఆసక్తికరంగా ఉన్నానని, ఇక్కడి సినిమాలు చేయాలని ఉందని ఆమె వెల్లడించింది. మంచి స్క్రిప్ట్ లు కనుక వస్తే ఇక్కడ నటించాలని ఉందని తన మనసులో మాటను చెప్పింది.తాను ప్రస్తుతం `చంద్రముఖి 2`లో నటిస్తున్న నేపథ్యంలో ఈ పాత్రని నేనే అడిగి మరి నటించాను.. `చంద్రముఖి2` దర్శకుడు వాసు వేరే వారియర్ ఫిల్మ్ స్టోరీతో తన వద్దకు వచ్చారని, కానీ అప్పటికే ఆయన `చంద్రముఖి 2`సినిమాని స్టార్ట్ చేశారని, అందులో చంద్రముఖి పాత్రకి ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదు. దీంతో నేను చేస్తానని అడిగి ఇందులో నటించినట్టు వెల్లడించింది కంగనా రనౌత్
Also Read
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!