Tamil Nadu: బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. ఈ విగ్రహాలపై తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తమిళనాడు కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారం, వెండి బల్లుల విగ్రహాల పనుల్లో గోల్‌మాల్ కలకలం సృష్టించింది.. వందల ఏళ్ల నాటి పాత బంగారాన్ని దొంగిలించారు.. పాత విగ్రహాల స్థానంలో బంగారం పూత పూసిన విగ్రహాలు పెట్టారు.. ఏళ్ల నుంచి భక్తులు తాకడంతో బంగారం, వెండి బల్లులు విగ్రహాలు బాగా అరిగిపోయాయి.. ఆలయ అధికారులు 6 నెలల క్రితం మరమ్మతు పనులు చేపట్టారు. తొలిసారి బంగారం, వెండి బల్లుల విగ్రహాలకు మరమ్మతులు చేశారు.. మరమ్మతుల సమయంలో పాత బంగారం మాయమైనట్టు ఆరోపణలు వచ్చాయి.. పాత విగ్రహాల స్థానంలో బంగారం పూత పూసిన విగ్రహాలు పెట్టారు.. ఈ ఘటనపై విచారణకు దేవాదయ శాఖ విచారణకు ఆదేశించింది.. పురావస్తు శాఖ కమిటీ ఆలయ అర్చకులను విచారించింది. డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.
కాగా, పౌరాణిక.. చారిత్రక నేపథ్యాలను కలిగిన ‘లక్ష్మీ వేంకటేశ్వరస్వామి’ క్షేత్రం ఇక్కడ దర్శమిస్తుంటుంది. ఇక్కడి అమ్మవారి మందిరం పైకప్పు మీద బంగారు, వెండి రంగులలో రెండు బల్లులు కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు.. ఈ బల్లులను తాకుతుంటారు. అప్పటి వరకూ బల్లుల మీద పడటం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి తప్పకుండా తొలగుతాయని స్థల పురాణం చెబుతోంది. అదే విధంగా బల్లి శరీరం మీద పడిన వారు… కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారం చేస్తే బల్లి పడిన దుష్పలితం ఉండదని కూడ ప్రజల్లో మరో నమ్మకం. బల్లి ఇంట తిరుగాడుతున్నప్పటీకీ …అది మీదపడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచారంలో ఉంది. అలా బల్లి పడినప్పుడు భయపడకుండా…. కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలచుకుని స్నానం చేసి, ఇష్టదేవతారాధన చేయడం వల్ల ఆ దోషం పోతుందని చెబుతారు.