Cyber Crime: కామారెడ్డిలో సైబర్ మోసం.. 5.8 లక్షలు రికవరీ చేసిన పోలీసులు..!
- అనామక నంబర్ నుంచి వీడియో కాల్
- ముంబై పోలీసులు అని పరిచయం
- మనీ లాండరింగ్ కేసు నమోదైందని బెదిరింపు.
- భయంతో బాధితుడు రాజేందర్ రూ. 5.80 లక్షలు ట్రాన్స్ఫర్ .
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: సైబర్ నేరగాళ్ల నుంచి 5.80 లక్షల రూపాయలు రికవరీ చేయడంలో కామారెడ్డి పట్టణ పోలీసులు విజయవంతమయ్యారు. ఇటీవల కామారెడ్డికి చెందిన రాజేందర్‌కు ఓ అనామక నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. కాల్లో మాట్లాడిన వ్యక్తులు ముంబై పోలీసులమని పరిచయం చేసుకున్నారు. రాజేందర్‌పై మనీ లాండరింగ్ కేసు నమోదైందని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు. అతడి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను తాము చెప్పిన ఖాతాకు వెంటనే బదిలీ చేయాలని, లేకపోతే అరెస్ట్ అవుతావని హెచ్చరించారు.
Read Also: Yoga Day 2025: యోగాసనాలు వేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు!
Also Read
దీనితో భయపడ్డ రాజేందర్, నేరగాళ్లు సూచించిన ఖాతాకు మొత్తం రూ. 5.80 లక్షలను ట్రాన్స్ఫర్ చేశారు. అనంతరం తాను మోస పోయానని గ్రహించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే స్పందించి, సైబర్ నేరగాళ్ల ఖాతాను ఫ్రీజ్ చేశారు. వారి ఆధునిక సాంకేతికతతో డబ్బును ట్రేస్ చేసి మొత్తాన్ని రికవరీ చేయడంలో పోలీసులు విజయవంతమయ్యారు. దీనితో కామారెడ్డి పోలీసుల చర్యపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద కాల్స్‌కు స్పందించకూడదని, ఎటువంటి డబ్బు లావాదేవీలు ముందస్తు పరిశీలన లేకుండా చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also: Literacy Rates 2025: అత్యధిక అక్షరాస్యత కలిగిన టాప్ 10 రాష్ట్రాలు
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!