Cyber Crime: సైబర్ నేరగాళ్ల నుంచి 5.80 లక్షల రూపాయలు రికవరీ చేయడంలో కామారెడ్డి పట్టణ పోలీసులు విజయవంతమయ్యారు. ఇటీవల కామారెడ్డికి చెందిన రాజేందర్‌కు ఓ అనామక నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. కాల్‌లో మాట్లాడిన వ్యక్తులు ముంబై పోలీసులమని పరిచయం చేసుకున్నారు. రాజేందర్‌పై మనీ లాండరింగ్ కేసు నమోదైందని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు. అతడి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను తాము చెప్పిన ఖాతాకు వెంటనే బదిలీ చేయాలని, లేకపోతే అరెస్ట్ అవుతావని హెచ్చరించారు.
Read Also: Yoga Day 2025: యోగాసనాలు వేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు!
దీనితో భయపడ్డ రాజేందర్, నేరగాళ్లు సూచించిన ఖాతాకు మొత్తం రూ. 5.80 లక్షలను ట్రాన్స్‌ఫర్ చేశారు. అనంతరం తాను మోస పోయానని గ్రహించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే స్పందించి, సైబర్ నేరగాళ్ల ఖాతాను ఫ్రీజ్ చేశారు. వారి ఆధునిక సాంకేతికతతో డబ్బును ట్రేస్ చేసి మొత్తాన్ని రికవరీ చేయడంలో పోలీసులు విజయవంతమయ్యారు. దీనితో కామారెడ్డి పోలీసుల చర్యపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద కాల్స్‌కు స్పందించకూడదని, ఎటువంటి డబ్బు లావాదేవీలు ముందస్తు పరిశీలన లేకుండా చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also: Literacy Rates 2025: అత్యధిక అక్షరాస్యత కలిగిన టాప్ 10 రాష్ట్రాలు
