Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ఇండియన్ 2 “. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో సిద్దార్థ్ ,కాజల్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.అలాగే ఎస్.జె.సూర్య ,బాబీ సింహ,సముద్రఖని వంటి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు .
Read Also :NTR31 : ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీలో రాక్షసుడిగా ఎన్టీఆర్..?
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో చిత్ర యూనిట్ బిజీ గా వుంది.ఈ సినిమాను మేకర్స్ జులై 12 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.దీనితో మేకర్స్ ఇప్పటి నుండే ప్రమోషన్స్ మొదలు పెట్టారు.ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్సె ,పోస్టర్స్ ,సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.ఈ నెల 25న ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముంబయిలో ఓ భారీ ఈవెంట్ ను నిర్వహించి ట్రైలర్‌ని విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ట్రైలర్ నిడివి రెండు నిమిషాల 36 సెకన్లు ఉండనుందని సమాచారం.ఇండియన్ 2 సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకులలో అంతగా బజ్ లేకపోవడంతో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహించే ఆలోచనలో వున్నారని సమాచారం.