కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. పీసీ ఘోష్ నివేదికను ఆధారంగా చేసుకుని తమపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విచారణ చేయడానికి కోర్టు నిరాకరించింది. రెగ్యులర్ పిటిషన్ల లాగే విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు విచారణ ఉంటుందని హైకోర్టు తెలిపింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై సీబీఐ విచారణ ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని కేసీఆర్, మంత్రి హరీష్‌రావులకు హైకోర్టు స్పష్టం చేసింది. రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తెలిపింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది. ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనల్ని కోర్టుకు వినిపించనున్నారు. వాదనల అనంతరం కోర్టు ఏ తీర్పు ఇస్తుందో చూడాలి.
Also Read: Kaleshwaram Project: గత ప్రభుత్వ జీవో రద్దు చేయకున్నా.. సీబీఐకి కాళేశ్వరం ప్రాజెక్టు కేసు, ఎలాగంటే?
కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగించాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆదివారం అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. నిర్మాణంలో అంతర్రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ భాగస్వామ్యమై ఉన్నాయని.. అందుకే కేసును సీబీఐకి అప్పగించడం సముచితమని అసెంబ్లీ భావిస్తోందని సీఎం చెప్పారు. కాళేశ్వరంపై దాదాపు 10 గంటల పాటు అసెంబ్లీలో సుదీర్ఘమైన చర్చలు, వాదనలు జరిగాయి.
