లబ్ధిదారులకు ఇంటి వద్దకే పింఛన్ ఇచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ టీడీపీ జనసేన ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా.. వింజమూరు ఎంపీడీవో కిరణ్ కుమార్ కు వింజమూరు మండల నాయకులతో కలిసి కాకర్ల సురేష్ మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. వృద్ధులకు, వికలాంగులకు, ఇతర పింఛను లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పింఛన్ల పంపిణీ పై వైసీపీ ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ధి కోసమే దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తోందని తెలిపారు.
Rajasthan High Court: వివాహేతర శృంగారం నేరం కాదు..
రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది వాలంటీర్లు.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎద్దేచ్ఛగా ఉల్లంఘించి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఓట్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేరుగా నగదు పంపిణీ చేసే కార్యక్రమాల నుండి వాలంటీర్ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేసిందన్నారు. మరోవైపు వృద్ధులకు ఇవ్వాల్సిన పింఛన్ల సొమ్మును వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు, బినామీలకు దోచిపెట్టి ఖజానా ఖాళీ చేసిందని తెలిపారు. దీన్ని కప్పి పుచ్చుకునేందుకు తెలుగుదేశం పార్టీపై బురద చల్లుతోందని దుయ్యబట్టారు.
AAP: మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన ఆప్
సుమారు 1.65 లక్షల మంది సచివాలయం సిబ్బంది 60 లక్షల మంది పింఛన్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందించటం పెద్ద కష్టం కాదని.. కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వం సచివాలయాల్లోని పెన్షన్లు పంపిణీకి ఆదేశాలు ఇచ్చిందని కాకర్ల సురేష్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం స్వార్థ రాజకీయం వల్ల మండుటెండల్లో వయోవృద్ధులు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. కనుక సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శి సేవలు వినియోగించుకుని లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే యుద్ధ ప్రాతిపదికను పింఛన్లను అందించాలని కోరుతున్నట్లు కాకర్ల సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల బాబు యాదవ్, జనసేన జోన్ కన్వీనర్ పొట్టి వెంకటేశ్వర్లు, చేజర్ల సుబ్బారెడ్డి, కోడూరు నాగిరెడ్డి, గూడ నరసారెడ్డి తదితరులు ఉన్నారు.