Narsapuram MPDO Dead Body Found in Eluru Canal పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ మిస్సింగ్ మిస్టరీ వీడింది. అదృశ్యమైన ఎంపీడీవో వెంకటరమణ మృతి చెందారు. ఏలూరు కాల్వలో ఎంపీడీవో వెంకటరమణ మృతదేహంను పోలీసులు ఈరోజు ఉదయం గుర్తించారు. ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ఎంపీడీవో మృతదేహాన్ని వెలికితీశాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహంను కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించనున్నారు. ఈ నెల 15న ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం అయిన విషయం తెలిసిందే. వెంకటరమణ రావు విజయవాడ సమీప…
ఏసీబీ పేరు చెప్పి ఎంపీడీవోకు ఐదు లక్షల రూపాయలు టోకరా వేశారు కేటుగాళ్లు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న బండి లక్ష్మప్పను కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. ఏసీబీకి ఫిర్యాదు వచ్చిందని ఎంపీడీవోకు నిందితులు ఫోన్ చేశారు. ఏసీబీలో తనపై కేసు నమోదు అవుతుందని ఎంపీడీవోను ఆగంతుకులు బెదిరించారు.
లబ్ధిదారులకు ఇంటి వద్దకే పింఛన్ ఇచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా.. వింజమూరు ఎంపీడీవో కిరణ్ కుమార్ కు వింజమూరు మండల నాయకులతో కలిసి కాకర్ల సురేష్ మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. వృద్ధులకు, వికలాంగులకు, ఇతర పింఛను లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పింఛన్ల పంపిణీ పై వైసీపీ…
Medchal: వయసు భేదం లేకుండా గుండెపోటుతో ఈ మధ్య కాలంలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అప్పటి వరకు ఆనందంగా గడిపిన వాళ్లు కొన్ని క్షణాల్లోనే విగతజీవులవుతున్నారు.
దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో.. వికారాబాద్ లో దోమ ఎంపీడీఓ కార్యాలయంలో ఇద్దరు బీఆర్ఎస్ లీడర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వార్త సంచలనంగా మారింది. వికారాబాద్‌లోని దోమ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు చోటుచేసుకుంది.