నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం బోయమడుగుల గ్రామంలో ఆదివారం రాత్రి పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమాన్ని మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
Read Also: Kurchi Madatha Petti: అమెరికా స్పోర్ట్స్ ఈవెంట్ లో కూడా మన డామినేషనేరా చారి..!
ఈ సందర్భంగా కాకర్ల సురేష్ కు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఇంటింటికి తిరిగి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేశారు. అదే విధంగా సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ముఖ్యంగా యువత కలలకు రెక్కలు డాట్ కామ్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకుంటే వారికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగ అవకాశాలతో పాటు బ్యాంకు లోన్ సదుపాయం వస్తుందని ఆయన తెలియజేశారు. ఇప్పటికే 50,000 మందికి పైగా మంది యువతులు ఆన్లైన్ లో నమోదు చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
Read Also: Sakshi Dhoni: హాయ్ మహీ.. మ్యాచ్ ఓడిపోయామని గ్రహించలేదు!
అలాగే, నియోజకవర్గంలోని అవ్వ తాతలను అక్క చెల్లెమ్మలను ఆప్యాయంగా టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పలకరించారు. ఆశీర్వదించండి అండగా సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రార్థించారు. అదే విధంగా అదే గ్రామంలో సీనియర్ నాయకులైన ఎంకే చౌదరి అనారోగ్యంతో బాధపడుతుండగా వారి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.