Site icon NTV Telugu

Kakarla Suresh: పల్లె పల్లెకు కాకర్ల.. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం

Kakarla Suresh

Kakarla Suresh

Kakarla Suresh: నెల్లూరు జిల్లాలోని మండల కేంద్రమైన సీతారాంపురం పరిధిలోని చిన్నాగంపల్లి, పబ్బులేటిపల్లి పంచాయతీల్లో ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ముఖ్యంగా మహిళలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న ఆయనకు మహిళలు హారతి ఇచ్చి సాదరంగా ఆహ్వానించా రు. ఉదయగిరి శాసనసభ అభ్యర్థిగా తనను గెలిపించాలని పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కాకర్ల ఈ సందర్భంగా కోరారు. ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ మహిళలు తన వెంట ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు అని ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు.

Read Also: CM Jagan: మళ్లీ ముగ్గురు కూటమిగా వస్తున్నారు.. ఒకసారి ఆలోచించండి!

అవ్వా తాతలను, ఆడపడుచులను ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటింటికి కాకర్ల సురేష్ తిరిగారు. ఆడపడుచులు హారతులు, అవ్వ తాతలు ఆప్యాయతలు, అన్నదమ్ముల జేజేల నడుమ, కోలాహలంగా ప్రచారం సాగింది. పల్లె పల్లెలో బ్రహ్మరథం, అడుగడుగునా నీరాజనాలు, పూల వర్షంతో పల్లె ప్రజలు ఘన స్వాగతం పలికారు. పల్లె ప్రాంతాల కష్టాలు చూసి చలించి పోయిన కాకర్ల సురేష్.. నాలుగు సంవత్సరాలలో రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. వ్యక్తిగత కష్టాలను, గ్రామ సమస్యలను ఉదయగిరి ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్‌కు గ్రామ ప్రజలు తెలిపారు. పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు కాకర్ల అడుగులో అడుగులు వేస్తూ ప్రచారం చేశారు. భానుడు భగభగలు లెక్కచేయక ఇంటింటికి తిరిగి ఆదరించాలని కోరుతూ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ వారి కష్టాలు తెలుసుకుంటున్నారు. సీతారాంపురం మండలంలో పల్లె ప్రజలు బ్రహ్మరథం పడుతూ కాకర్ల సురేష్‌ను ఆశీర్వదిస్తామని హామీ ఇచ్చారు.

 

Exit mobile version