Kajol: బాలీవుడ్ బ్యూటీ కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే లస్ట్ స్టోరీస్ 2 లో మంచి బోల్డ్ లుక్ లో కనిపించి మెప్పించిన ఈమె.. ఈ సిరీస్ తరువాత మంచి అవకాశాలనే అందుకుంటుంది. ఇప్పటికే రాఘవేంద్రరావు కోడలు కనికా థిల్లాన్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న ఒక చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో ఆమె తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడి షాక్ ఇచ్చింది. లస్ట్ స్టోరీస్ 2 లో ఒక టీనేజర్ కు తల్లిగా ఆమె నటించింది. ఈ నేపథ్యంలోనే ఆమె తన పిల్లల గురించి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. తన సినిమాలు తన పిల్లలే చూడరని తెలిపింది. కాజోల్, హీరో అజయ్ దేవగన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. వీరికి ఇద్దరు పిల్లలు. రీల్ లో ఎన్నో తల్లి పాత్రలు చేశాను కానీ .. తాను బయ వేరుగా ఉంటానని చెప్పింది.
Salaar Teaser: ఏయ్.. బాబు.. త్వరగా పడుకోవాలి.. పొద్దునే లేవాలి కదా
” నేను ఎన్నో సినిమాల్లో తల్లిగా నటించాను. రీల్ లైఫ్ లో తల్లి పాత్రకు రియల్ లైఫ్ లో తల్లి పాత్రకు అస్సలు సంబంధం ఉండదు. కానీ, రీల్ లైఫ్ లో కూడా సహజంగా ఉండేలా ప్రయత్నిస్తాను. నా పిల్లలకు నాలో చాలా విషయాలు నచ్చవు. నిజం చెప్పాలంటే నా సినిమాలు వాళ్లు అస్సలు చూడరు. బలవంతంగా కూర్చోపెట్టి చూడమన్నా కూడా చూడరు. వారికి నేను స్క్రీన్ పై చూడటం నచ్చదు. వారికే కాదు.. మా బంధువుల్లో కూడా నేను స్క్రీన్ పై నటించడం నచ్చదు. అందుకు కారణం.. నేను ఏడుస్తుంటే వాళ్ళు చూడలేరు. ఒకరకంగా ఇది కూడా ఒక గొప్ప ప్రశంస అని చెప్పాలి” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది.