Site icon NTV Telugu

Kadiyam Srihari : రేవంత్ రెడ్డి హుందాతనం మరిచి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు

Kadiyam Srihari

Kadiyam Srihari

సీఎం రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజల సంక్షేమం గాలికి వదిలేసారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసిఆర్ ను విమర్శించడానికి, దూషిండడమే పనిగా పెట్టుకున్నాడన్నారు కడియం శ్రీహరి. రేవంత్ రెడ్డి హుందాతనం మరిచి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం అయ్యారు… ఆయన భాష మారుతుంది అని ఆశించామని కడియం శ్రీహరి అన్నారు. కానీ కేసీఆర్ ను అసభ్య పదజాలం తో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అని ఆయన ధ్వజమెత్తారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, మాకు మైక్ ఇవ్వాలని అడిగాం కానీ ఇవ్వకుండా మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

California: కాలిఫోర్నియాలో పిల్లలతో సహా భారతీయ కుటుంబం మృతి.. హత్య-ఆత్మహత్యగా పోలీసుల అనునమానం

మమల్ని తిట్టించడానికే సభ నడిపిస్తున్నట్టు ఉన్నారని, దీనిపై అసెంబ్లీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు కడియం శ్రీహరి. మీడియా పాయింట్ లో మాట్లాడుదాం అంటే పోలీసులను పెట్టీ అడ్డగించారని, కంచెలు తెలంగాణ లో లేవు అంటూ గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఇనుప కంచెలు వేసి అడ్డుకున్నారన్నారి కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ ముందు కంచెలు బద్దలు కొట్టామని గొప్పలు చెప్పుకుంది కానీ.. అసెంబ్లీ లో ఎందుకు కంచెలు పెట్టారు..? అని ఆయన అన్నారు. అంతకు ముందు అసెంబ్లీలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ విషయంలో విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గోరంతను కొండంత చేయొద్దని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హితవు పలికారు. ఓట్‌ ఆన్‌ బడ్జ్‌ట్‌పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా అనేక రిజర్వాయర్లు వచ్చాయి. దానికి అనుబంధంగా ఎన్నో ప్రాజెక్ట్‌లు నిర్మించుకున్నాం. నీటి నిల్వ నిల్వ సామర్థ్యం పెరిగిందని పేర్కొన్నారు.

Farmers Protest: “గతంలో తప్పించుకున్నాడు, పంజాబ్ వస్తే ఎవరూ రక్షించలేరు”.. ప్రధాని మోడీకి బెదిరింపులు..

Exit mobile version