NTV Telugu Site icon

Kadiyam Srihari : కేటీఆర్ రేపో మాపో అరెస్టు అవుతారు

Kadiyam Srihari

Kadiyam Srihari

Kadiyam Srihari : బీఆర్‌ఎస్‌ పై, కేసీఆర్‌ కుటుంబంపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇవాళ జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్‌లో గ్రామస్తులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కవిత ఇప్పటికే జైలుకు వెళ్లివచ్చింది.. కేటీఆర్ రేపో మాపో అరెస్టు అవుతారన్నారు. హరీష్ రావు, కేసీఆర్‌ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల కుటుంబం పది సంవత్సరాల పాలనలో… కొత్త రకమైన అవినీతికి తెరలేపిందని, సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ.. లిక్కర్ కుంభకోణంలో ఎన్ని రోజులు తీహార్ జైల్లో ఉందో అందరికీ తెలిసిందే అని ఆయన వ్యాఖ్యానించారు. రేపో, మాపో ఫార్ములా ఇ రేసులో కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమని కడియం శ్రీహరి ఉద్ఘాటించారు.

TDR Bonds: టీడీఆర్‌ బాండ్లపై కీలక ఆదేశాలు.. అవి మినహా మిగతావి రిలీజ్..

అంతేకాకుండా..’కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పూర్తికాగానే… కెసిఆర్ తో పాటు హరీష్ రావు కూడా జైలుకి వెళ్లాల్సిందే. కల్వకుంట్ల కుటుంబం వివిధ కేసుల్లో ఇరుక్కుని.. కొందరు జైలు ఊచలు లెక్కపెట్టి వస్తే. మరికొందరు జైలు ఊచలు లెక్క పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి 2014 కు ముందు ఉన్న ఆస్తులు… ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎంతో ప్రకటించాలి. దళిత బందులో కమిషన్ తీసుకున్నవారు.. నీతులు మాట్లాడడం హాస్యాస్పదం. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారు నీతులు మాట్లాడడం విడ్డూరం.. కడియం శ్రీహరి తప్పు చేస్తే ఆధారాలు చూపించండి.. ఇకనైనా సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలి..’ అని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.

Barbaric : బార్బరిక్ టీజర్ రిలీజ్ చేసిన స్టార్ దర్శకుడు మారుతి

Show comments