Barbaric : బార్బరిక్ టీజర్ రిలీజ్ చేసిన స్టార్ దర్శకుడు మారుతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న ‘బార్బరిక్’ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను,సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం నాడు రిలీజ్ చేశారు. ‘స్వీయ నాశనానికి మూడు ద్వారాలున్నాయి. ఇది నువ్వో నేనో చేసే పని కాదు దిమాక్ ఉన్నోడే చేయాలి. ఒకడు తాచు పాము తోకని తొక్కాడు తొక్కిన వాడ్ని పాము కాటేయబోతోంది. మరి తొక్కించిన వాడి సంగతేంటి. అంటూ అదిరిపోయే డైలాగ్స్‌తో సాగిన ఈ టీజర్‌లో ఎన్నో హైలెట్స్ ఉన్నాయి. టీజర్‌లో సత్యరాజ్, వశిష్ట, సత్యం రాజేష్ ఇలా చాలా పాత్రలకు ఉన్న ఇంపార్టెన్స్‌ను చూపించారు. ఇక టీజర్ చివర్లో వదిలిన షాట్స్, చూపించిన గెటప్స్ నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయి. టీజర్ రిలీజ్ అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
స్టార్ దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘బార్బరిక్ సినిమా టీంకు సలహాలు, సూచనలు ఇచ్చాను. ఇది చాలా రిస్కీ జానర్ అని చెప్పాను. మోహన్, రాజేష్ చాలా కాన్ఫిడెన్స్‌తో సినిమాను స్టార్ట్ చేశారు. విజయ్ ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు. విజయ్ అతి తక్కువ టైంలోనే పెద్ద ప్రొడ్యూసర్ కానున్నారు. విజయ్ తో కలిసి మరో సినిమాను చేయబోతున్నాను. మోహన్ లోపలకి బార్బరికుడు వెళ్లిపోయాడు. ఈ మూవీని చాలా చక్కగా తీశారు. రమేష్ రెడ్డి గారి కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. ఇంఫ్యూజన్ బ్యాండ్ ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని ఇచ్చారు. ఈ మూవీ చాలా కొత్తగా ఉంటుంది. మైథలాజికల్ పాయింట్‌లో ఉన్న పాత్ర ప్రజెంట్ జనరేషన్‌కి వస్తే ఎలా ఉంటుందో చూపించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది’ అని అన్నారు.
తాజావార్తలు
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!