ఈ తొమ్మిది ఏళ్ళ కేసీఆర్ పాలనలో బ్రహ్మండమైన ప్రగతి సాధించినమని అన్నారు కడియం శ్రీహరి. ఇవాళ జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కడియం శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ మాటలు నమ్మితే మళ్ళీ వెనక్కి వెళ్తాం, తెలంగాణ నష్టపోతదన్నారు. రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు తెలంగాణలో కేసీఆర్ ను బలపర్చేందుకు సిద్ధం గా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన బీజేపీకి తెలంగాణలో ఏం అవసరమని ఆయన అన్నారు. హౌర్ ఎక్ దక్క మూడోసారి కేసీఆర్ పక్క అనే నినాదంతో ప్రజలు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Animal: యానిమల్ కా బాప్.. అంటే ఈ రేంజ్ లోనే ఉండాలి
ఉమ్మడి వరంగల్ జిల్లా బీజేపీ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా రాదని ఆయన అన్నారు. మహిళ బిల్లును హృదయపూర్వకంగా అందరం స్వాగతిస్తున్నామని, చెరువులు కుంటలు నిండినట్లుగా మా పార్టీలో కూడా నాయకులు నిండిపోయారన్నారు. చెరువులు కుంటలు నిండిపోతే ఎలాగైతే చేపలు మత్తడి నుండి బయటకు జరుతాయో, అలాగే మా పార్టీ నుండి కూడా ఎంతమంది బయటకి వెళ్లిన, బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరగదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అనేక దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ తెలంగాణకు ఏం చేసిందని కడియం ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ ఆరు హామీలతో ప్రజలు ముందుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ రాష్ట్రానికి ఒక మ్యానిఫెస్టో పెట్టడం ప్రజలను మోసం చేయడమే అని విమర్శించారు. కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో మీరు ప్రకటించిన హామీలు అమలు చేశారా.. చేస్తారా.. అని కడియం ప్రశ్నించారు.
Also Read : NTR: మాస్.. టెర్రిఫిక్.. ఇలాంటి పదాలు సరిపోవేమో.. దేవరకు దండం పెట్టడమే