హన్మకొండ జిల్లాలోని మడికొండ సత్యం గార్డెన్స్ లో జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య విరుచుకపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లను దారుణంగా మోసం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అని తెలిపారు. వేరే వారికి విలువల గురించి గొప్పగా చెప్పే కడియం శ్రీహరి ముందు ఆయన మాత్రం విలువల్ని పాటించరు అని ఆయన చెప్పారు. కడియం శ్రీహరిని మాదిగ జాతి తూ అంటూ ఉమ్మి వేస్తుంది అని విమర్శించారు. కడియం శ్రీహరి కార్యకర్తలని కంటికి రెప్పలా కాపాడడు, కంట్లో పెట్టుకొని చూస్తా ఉంటాడు.. కానీ, రాజయ్య దగ్గరికి ఎవరు వెళ్తున్నారు.. ఆయనకు గిట్టని వాళ్లను ఎవర్ని కలుస్తున్నారు చూసి వారిని టార్గెట్ చేసే నైజాం కడియం శ్రీహరిది అంటూ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Road Accident: శ్రీరామనవమి ఏర్పాట్లలో అపశృతి.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
కడియం శ్రీహరి హవాల ద్వారా డబ్బులు పంపితే మలేషియా, సింగపూర్ లో వాళ్ళ కుటుంబ సభ్యులు భూములు కొన్నారు అని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉన్నప్పుడు హవాల ద్వారా విదేశాలకు డబ్బులు పంపించిన ఘనుడు కడియం శ్రీహరి అని పేర్కొన్నారు. ఈయన నా గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు అంటూ మండిపడ్డారు. తొందరలోనే కడియం శ్రీహరికి ప్రజలే తగిన బుద్ది చెబుతారని చెప్పుకొచ్చారు.