NTV Telugu Site icon

Kadiyam Srihari: రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చని దద్దమ్మ ప్రభుత్వం బీజేపీ, నరేంద్ర మోడీ..

Kadiyam Srihari

Kadiyam Srihari

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, మాజీ ఎంపీ పసునూరి దయాకర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. పాలకుర్తి ప్రజల దెబ్బకు దయాకర్ మైండ్ బ్లాక్ అయ్యిందన్నారు. యశస్విని రెడ్డి దెబ్బకు చిన్న మెదడు చితికిపోయింది అని పేర్కొన్నారు. దయాకర్ రావు బిత్తిరి బిత్తిరిగా మాట్లాడుతున్నాడు.. ఓటమితో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకు వచ్చింది అని కడియం శ్రీహరి అన్నారు.

Read Also: Char Dham Yatra 2024: చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పూర్తి వివరాలు..

భారత జనతా పార్టీ తెలంగాణకు చేసింది ఏం లేదు.. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చని దద్దమ్మ ప్రభుత్వం బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మణిపూర్ లో దళితులు, ముస్లింలు, క్రైస్తవులపై దాడులు చేసిన పట్టించుకోలేదు.. మణిపూర్ భారతదేశంలో భాగం కాదా మోడీ అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ పేరిట బుల్డోజర్ సర్కార్ నడిపిస్తున్నారు అని మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని అంటున్నారు.. రిజర్వేషన్లు ఎత్తివేస్తారట.. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అవసరమా.. సీఎం రేవంత్ రెడ్డితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అన్ని హామీలు నెరవేరుస్తారు.. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కడియం శ్రీహరి తెలిపారు.

Read Also: Uttam Kumar Reddy: ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది.. రాహుల్ గాంధే ప్రధాని..!

ఇక, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. మన ఎంపీ అభ్యర్థి కావ్య అక్కను అధిక మెజార్టీతో గెలిపించాలి అని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్న గాని ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వెనకడుగు వేయలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లె ప్రయత్నం చేస్తున్నారు అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు.. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. బీజేపీ ప్రభుత్వం మత కల్లోలాలను సృష్టిస్తుంది అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పదవులను ఆశించలేదు.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎండిపోయిన పంటలకు 10, 000 నష్ట పరిహారం ఇస్తారని చెప్పారు.. కానీ ఇయ్యలేదని ఆమె చెప్పారు. టిఆర్ఎస్ పార్టీ వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా ఇప్పుడు బయటకెళ్ళి ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని ఆరోపించింది. పాలకుర్తి- చెన్నూరు రిజర్వాయర్.. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది.. ఐదు సంవత్సరాలు పూర్తి అవ్వకముందే దాన్ని పూర్తి చేసే బాధ్యత నాది అని ఎమ్మె్ల్యే యశస్విని రెడ్డి హామీ ఇచ్చారు.