Kadiyam Srihari : సీఎం రేవంత్ రెడ్డి నోటికి హద్దు, అదుపు లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నోటికి హద్దు, అదుపు లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి సీఎం ను అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. సీఎంకు ఉండవలసిన హుందాతనం రేవంత్ రెడ్డిలో లోపిస్తుందన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ కార్యకర్త లాగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నా తీరు చూస్తుంటే చాలా భాద అనిపిస్తుందన్నారు కడియం శ్రీహరి. మీరు తిడుతుంటే…మేము పడుతూ ఉంటామా?.. మాకు కూడా చీము,నెత్తురు ఉన్నదిగా….మేము కూడా ఎదో ఒక భాషలో తిట్టాలాగా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ను చార్లెస్ శోభరాజ్, కేటీఆర్- హరీష్ రావు లను బిల్లా-రంగా అని విమర్శించడం విడ్డూరమన్నారు. చార్లెస్ శోభరాజ్, బిల్లా- రంగా కంటే పెద్ద చరిత్ర రేవంత్ రెడ్డిది అని, రేవంత్ రెడ్డి చరిత్ర తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
సభ్యత సంస్కారం తెలుసుకొని రేవంత్ రెడ్డి మాట్లాడాలన్నారు. బీఆర్‌ఎస్ ను బోందపెట్టేవాడు.. ముక్కలు చేసేవాడు ఇంకా పుట్టలేదన్నారు. బీఆర్ఎస్ ను పాతిపెట్టడం ఎవరితో కాదు.. నీ అయ్యాతో కూడా కాదన్నారు. పాలకుర్తి నియోజకవర్గం BRS విస్తృతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు కడియం శ్రీహరి. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినా కూడా రేవంత్ రెడ్డిలో ఎలాంటి మార్పు కనపడటం లేదన్నారు కడియం శ్రీహరి. సీఎంగా ఉన్నప్పుడు కొంచెం హుందాగా ఉండటం నేర్చుకోవాలని హితవు పలికారు. బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టే మొనగాడు పుట్టలేదన్నారు. గతంలో కేటీఆర్ దావోస్ వెళ్లినప్పుడు ఎంతో హుందాగా ప్రవర్తించారని గుర్తు చేశారు. పెట్టుబడులు సాధించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని చెప్పుకొచ్చారు. దేశంలోనే రోల్ మోడల్ తెలంగాణాను అభివృద్ధి చేసిన కేసీఆర్‌ను ఇష్టమున్నట్టు తిట్టడం సరికాదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విసుగు ప్రారంభం అయిందని తెలిపారు. కేసీఆర్‌ను అనవసరంగా ఓడించామని బాధపడుతున్నారని అన్నారు. ఇక.. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. బీఆర్‌ఎస్ విజయం సాధించడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!