Kadiyam Kavya : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఫార్మసీ విభాగాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కడియం కావ్య
- వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కడియం కావ్య ఆకస్మిక తనిఖీ
- నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫార్మసీ సిబ్బందిపై ఎంపీ ఆగ్రహం
- విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఫార్మసీ విభాగాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆకస్మిక తనిఖీ చేశారు. మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ గార్లతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు MGM ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఓ రోగి బంధువు తనకు మందులు ఇవ్వడం లేదన్న విషయాన్ని మంత్రులు, ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య రోగిని తీసుకుని నేరుగా ఎంజీఎం ఆస్పత్రిలోని ఫార్మసీ కేంద్రానికి చెరుకుని పేషెంట్లకు ఇస్తున్న మందులను పరిశీలించారు. మందుల స్టాక్ వివరాలను రిజిస్టర్ ను పరిశీలించారు. ఎన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయో ఎంపీ స్వయంగా పరిశీలించారు. అందుబాటులో ఉన్న మందుల వివరాలను సేకరించారు. స్వతహాగా డాక్టర్ అవ్వడం వలన క్షుణంగా మెడిసిన్స్ గురించి, సీడిఎస్ నుండి రావలసిన మందుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
Samantha: హాస్పిటల్ బెడ్‌పై సమంత.. అందుకే అంటూ పోస్ట్
దాదాపు మూడు నెలలుగా మెడిసిన్స్ అందుబాటులో లేకపోయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫార్మసీ సిబ్బందిపై ఎంపి డాక్టర్ కడియం కావ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు పెద్దదిక్కుగా ఉన్న MGM ఆసుపత్రిలో కనీసం పెయిన్ కిల్లర్స్ కూడా అందుబాటులో లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. మందులు అందుబాటులో లేవు అంటూ బయటకు రాయడం సరికాదని, మరోసారి ఇలాంటి తప్పులు పునరావృతం అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం విషయాన్ని ఎంపీ డా. కడియం కావ్య మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లారు. ఎంపీ డా.కడియం కావ్య గారు అందించిన వివరాలతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వైద్య అధికారులను మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూడాలని అన్నారు. ముఖ్యంగా పేద ప్రజలకు అందాల్సిన విద్యా, వైద్యం లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
Andhra Pradesh: పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ రిజర్వేషన్‌పై రేపు చర్చలు
తాజావార్తలు
-
Char Dham Yatra: హిమాలయాల్లో ఆధ్యాత్మిక శోభ.. తెరుచుకున్న గంగోత్రి, యమునోత్రి ద్వారాలు!
-
Praful Hinge: తొలి ఓవర్లో 15 రన్స్.. చివరి ఓవర్లో కట్టడి.. మరోసారి నిరూపించుకున్న ప్రఫుల్ హింగే!
-
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెల్త్ కండిషన్‌పై డాక్టర్ల కీలక ప్రకటన!
-
Raaka: ‘రాకా’ రిలీజ్ పై సరికొత్త బజ్..
-
Tollywood : రిలీజయ్యాక ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించేందుకు పీక్స్ ప్రమోషన్స్ చేస్తోన్న హీరోస్
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!