దుల్కర్ సల్మాన్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న కాంత సినిమా షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12వ తేదీన, అంటే రేపు, రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు ప్రమోషనల్ కార్యక్రమాలు ఏమీ చేయకపోవడంతో సినిమా వాయిదా పడుతుందని అందరూ భావించారు. అందరూ భావించిన విధంగానే, సినిమా యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
Also Read: Abhishek Sharma: తొలి భారత క్రికెటర్‌గా అభిషేక్ శర్మ అరుదైన రికార్డు!
మా ప్రియమైన ప్రేక్షకులందరికీ నమస్కారం. కాంత టీజర్ విడుదలైన రోజు నుంచి మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయం, మద్దతు మమ్మల్ని ఎంతో హత్తుకుంది. అది మాకు చాలా విలువైనది. మా చిత్రానికి సంబంధించి మీకు మరింత మెరుగైన అనుభూతి ఇవ్వాలనుకుంటున్నాం. “కొత్త లోక” ఘన విజయంతో, చంద్ర బాక్సాఫీస్‌లో దూసుకెళ్తూ కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. అదే ఉత్సాహంతో, మిమ్మల్ని మరో అద్భుతమైన సినీ ప్రయాణంలోకి తీసుకెళ్లే ప్రత్యేక అనుభూతిని మేము సిద్ధం చేస్తున్నాం. ఆ దృష్ట్యా, మా చిత్రం “కాంత” విడుదల వాయిదా పడిందని మీకు తెలియజేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం. అంతవరకు మాకు ఇలానే అండగా నిలుస్తారని ఆశిస్తున్నాం. త్వరలోనే మీ అందరినీ థియేటర్‌లలో కలవాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం. ప్రేమతో, టీమ్ కాంత అంటూ ఒక లేఖ విడుదల చేశారు.