K. Laxman : కేసీఆర్ ఉద్యోగం ఊడటం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ వర్గం కూడా బీఆర్‌ఎస్‌కు ఓటెయ్యడనికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఉద్యోగం ఊడటం ఖాయమన్నారు. సందట్లో సడేమియా లాగా కాంగ్రెస్ దూరుదమని ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్ ముడిపడి ఉన్న ఎన్నికగా ప్రజల్లో ఉంటున్నామన్నారు లక్ష్మణ్. యువత, నిరుద్యోగం ఇవే ప్రధాన సమస్యలు అని, ఆనాటి ఉద్యమం ఎలా కొనసాగిందో యువత ఇవ్వాళ కేసీఆర్‌ను ఓడించి బీజేపీ నీ గెలిపించాలని ఎదురుచూస్తున్నారన్నారు లక్ష్మణ్.
అంతేకాకుండా.. ‘ఉద్యోగాల కోసం ఎదురుచూసి బతుకు భారంగా మారి జీవచ్చం లా మారి బతుకుతున్నారు. కొలువుల కోసం వచ్చిన తెలంగాణ లో కొలువులు రాకుండా పోయాయి. 2014 నుంచి భర్తీ చేస్తామని చెప్పినా కూడా ఇంతవరకు ఆ దిశగా ప్రయత్నం చెయ్యలేదు. 3 లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. పీఆర్‌ఎస్ నివేదిక కూడా ఇచ్చింది. 50 లక్షల పైగా నిరుద్యోగులు ఉన్నారు. ఒక్క గ్రూప్ కూడా వెయ్యలేదంటే కెసిఆర్ చిత్తశుద్ది అర్దం అవుతున్నది. ప్రభుత్వ పాఠశాలలు మూత పడుతున్నాయి, డీఎస్సీ వేసే పరిస్థితి లేదు. పది వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను మెడలు పంపి బయటకు పంపారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్నవి ఊడ పీకిండ్రు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉండదని ప్రగల్భాలు పలికి మొహం చాటేశారు. ఉద్యోగం పోయిన cm కూతురు ను మాత్రం దొడ్డి దారిన ఉద్యోగం ఇచ్చారు. ట్విట్టర్ టిల్లు మాత్రం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గప్పలు కొడుతున్నాడు. ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు.. ఏమైంది? ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వలేదు. తల్లిదండ్రులు కూడా ఆలోచన చెయ్యాలి. కొత్త జిల్లాలు, రెవెన్యూ, గ్రామ పంచాయతీ ల ఆధారంగా కొత్త ఉద్యోగాలు ఏవి? మొన్న ప్రవళిక ఆత్మహత్య కూడా ప్రేమ పేరు నెపం నెట్టారు.. వారి ఉసురు ఊరికే పోదు.
Also Read
- CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
- ETPL Dublin Guardians: రాహుల్ ద్రవిడ్ యజమానిగా, రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్‌గా సరికొత్త టీం బరిలోకి.!
- Kondagattu Anjanna Temple: సంజీవని పర్వతం రాలిన చోటు.. కొండగట్టు అంజన్న ఆలయ విశిష్టత మీకు తెలుసా?
- Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
మీ పిల్లలు ఉద్యోగాలు చెయ్యాలా? ఉరికి పోవాల?. 50 వేల జీతం దోచుకొని 2000 పెన్షన్ ఇస్తున్నాడు. నిరుద్యోగుల కు కొలువు రావాలంటే కెసిఆర్ కొలువు పోవాల్సిందే. ప్రపంచం లో ఇంత అబద్దాల నాయకుడు ఎక్కడ లేడు. ఓటర్లు ఫూల్స్ కాదు.. షూటర్స్. అని నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. అమిత్ షా రేపు హైదరాబద్ వస్తున్నారు, మానిఫెస్టో విడుదల చేస్తారు. 18 న గద్వాల, నల్గొండ, వరంగల్ లో బహిరంగ సభలు. హైదరాబాద్ లో mrps నాయకుల తో సమావేశం. కులగణన కు బీజేపీ వ్యతిరేకం కాదు బీసీ లకు న్యాయం జరిగే శాస్త్రీయత కోసమే మా ఆలోచన. రాష్ట్రాలకు కుల గణన విషయము లో మోడీ సర్కారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. బీసీ సీఎం అంటే సామాజిక న్యాయం.. అన్నీ వర్గాలకు నాయ్యం చెయ్యడమే. నాయకులు ఎవరి భవిష్యత్ కోసం వారు వెళ్తున్నారు కానీ బీజేపీ తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసమే పని చేస్తున్నారు. పది సంవత్సరాల నిద్ర మత్తు తర్వాత ktr మెల్కొన్నడు. పదేండ్లు రేషన్ కార్డు కూడా ఇవ్వలేని కేటీఆర్ ను దేనితో కొట్టాలో ప్రజలు తెల్చుకుంటారు.
మోడీ మాత్రం 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Sreeleela: తమిళనాడు కోడలిగా శ్రీలీల..? తాజా కామెంట్స్ హాట్ టాపిక్!
-
Ali : అలీ కీలక పాత్రలో కొత్త సినిమా ప్రారంభం!
-
NBK – Vivek Athreya : వివేక్ ఆత్రేయ సినిమాలో ‘బాలయ్య’ డ్యూయల్ రోల్.. ఊచకోత అన్ లిమిటెడ్
-
CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
-
Raj Tarun: నిద్రలో నడుస్తూ హత్యలు.. రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్ రిలీజ్!
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..