టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ప్రత్యేకంగా రోల్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతి. సినిమాలు, టీవీ షోలకు కొంత దూరంగా ఉన్న ఆమె ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, ఓటిటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టుతోంది. ఈ క్రమంలో ఓ షోకు హాజరైన జ్యోతి, తన కెరీర్ అనుభవాలు, పర్సనల్ అభిప్రాయాలు బోల్డ్‌గా షేర్ చేసింది. ముఖ్యంగా నటుడు విజయ్ దేవరకొండ గురించి చెప్పిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : Bhagyashri Borse : కచ్చితంగా లవ్ మ్యారేజే చేసుకుంటా..
ఇంటర్వ్యూలో “ఈ జనరేషన్‌లో ఎవరితో నటించాలనుకుంటున్నారు?” అని అడగగా, జ్యోతి ఏ మాత్రం తడుముకోకుండా “విజయ్ దేవరకొండ” అని చెప్పింది. వెంటనే “ఏ రకం క్యారెక్టర్?” అని అడగగా, జ్యోతి “ఘాటైన రొమాంటిక్ మూవీలో ఆయనతో కలిసి నటించాలని ఉంది. విజయ్ దేవరకొండ గారువినిపిస్తుందా?” అని బోల్డ్‌గా స్పందించింది. ఆ తరువాత “లిప్ కిస్ సీన్ వస్తే చేస్తారా?” అని అడిగింది. దీనికి జ్యోతి షాకింగ్ సమాధానం ఇస్తూ “తప్పకుండా చేస్తా! సీన్ డిమాండ్ అయితే దేనికైనా రెడీ. ప్రత్యేకంగా విజయ్ దేవరకొండ అయితే 100% రెడీ!” అని చెప్పేసింది. అదే సమయంలో “అర్జున్ రెడ్డి చూసినప్పటి నుండి ఆయన్నంటే పిచ్చి ఒకరకంగా క్రష్!” అని నవ్వుతూ చెప్పింది.
తర్వాత “ఇండస్ట్రీలో ఎవరితో నటించలేకపోయాననే బాధ ఉందా?” అని అడగగా, జ్యోతి చిరంజీవితో తన మధురానుభవాన్ని గుర్తుచేసుకుంది. “అందరివాడు సినిమాలో చిరంజీవి గారితో పనిచేసే ఛాన్స్ వచ్చినప్పుడు ఏ రోల్ అనేది కూడా అడగకుండా వెంటనే ఓకే చెప్పా. కానీ సెట్‌కి వెళ్లాక నేను ఆయనను రిజెక్ట్ చేసే పాత్ర అని తెలిసింది!” అని చెప్పారు. “పెళ్లి చూపుల సీన్‌లో ‘మీరు నచ్చలేదు వేరొకరిని పెళ్లి చేసుకుంటా’ అని చెప్పాల్సి వచ్చింది. ఆ సీన్ చేసి ఇంటికి వెళ్ళాక అద్దం ముందు నిలబడి ‘చిరంజీవిని కాదనడం ఏంటి?’ అంటూ నన్ను నేనే తిట్టుకున్నా” అని నవ్వుకుంటూ చెప్పింది. జ్యోతి చేసిన ఈ బోల్డ్ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా “విజయ్ దేవరకొండతో రొమాంటిక్ మూవీ, లిప్‌లాక్‌కైనా రెడీ” అన్న వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.