తెలంగాణలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. ఈ పోస్టులకు ఇవాళ్టి నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది.. కానీ.. సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 20 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. అంతేకాకుండా దరఖాస్తు గడువును జనవరి 6 నుంచి జనవరి 10 కి పొడిగించింది. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి తాజాగా విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1392 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు జేఎల్ పోస్టుల నోటిఫికేషన్ వెలువడలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో నోటిఫికేషన్ జారీ చేశారు.
Also Read :CM Jaganmohan Reddy: ‘గడప గడపకు మన ప్రభుత్వం’పై సీఎం సమీక్ష.. ఏం మాట్లాడారంటే..
అనేక అవాంతరాల తర్వాత ఈ పోస్టులను 2012లో భర్తీ చేశారు. అయితే.. తెలంగాణ ప్రాంతంలో సుమారు 457 జేఎల్ పోస్టులను అప్పట్లో భర్తీ చేయగలిగారు. ఆ తర్వాత మళ్లీ జేఎల్ పోస్టుల భర్తీ జరగలేదు. ఈ నేపథ్యంలో జేఎల్ పోస్టుల కోసం ఈసారి అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీపడే అవకాశం ఉంది. ఇక.. ఈ 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 16 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కొన్ని సాంకేతిక కారణాల చేత.. డిసెంబర్ 20 నుంచి దరకాస్తు చేసుకునే అవకాశం కల్పించింది టీఎస్పీఎస్సీ. ఆసక్తి కలిగినవారు వచ్చే ఏడాది (2023) జనవరి 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ పేర్కొంది. 2023 జున్ లేదా జూలైలో ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనుంది టీఎస్పీఎస్సీ.