టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా పడింది. రేపు (శుక్రవారం) ఉదయం గం.10.30 సమయానికి ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును విచారించేందుకు కస్టడీకి అనుమతించాలని ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజు సాయంత్రమే దీనిపై తీర్పు వస్తుందని అంతా భావించారు. మొదట ఈ కేసు తీర్పును 10 నిమిషాలు వాయిదా వేసిన న్యాయమూర్తి.. ఆ తరువాత రేపు తీర్పు వెల్లడిస్తానని తెలిపారు. ఇదిలా ఉంటే.. హైకోర్టులో చంద్రబాబు తరపున లాయర్లు క్వాష్ పిటిషన్ వేయడం.. దానిపై తీర్పు పెండింగ్‌లో ఉండటంతో.. ఆ తీర్పు అంశంపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇరు పక్షాలు బలంగా తమ వాదనలు వినిపించాయి. ఇప్పుడు పిటిషన్‌పై తీర్పు వాయిదా పడటంతో అందరిలోను ఉత్కంఠ కనిపిస్తోంది. ఇది రిజర్వ్ తీర్పు కాబట్టి రేపు రావొచ్చు లేదా సోమవారం నాటికి రావొచ్చునని న్యాయనిపుణులు చెబుతున్నారు.
Read Also: Mumbai: దారుణం.. కదులుతున్న కారులో బాలికపై అత్యాచారం..
ఇదిలా ఉంటే.. చంద్రబాబును ఐదు రోజులు కస్టడీని కోరుతూ సీఐడీ… ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రూ.371 కోట్ల స్కామ్ జరిగిందని సీఐడీ అంటుండగా.. అవన్నీ అవినీతి ఆరోపణలు మాత్రమే, ఎలాంటి ఆధారాలు లేవని చంద్రబాబు తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. మరిన్ని విషయాలు వెలికితీసేందుకు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరఫు న్యాయవాది కోరగా, సిట్ కార్యాలయంలో ఇప్పటికే విచారణ జరిపారని, రాజకీయ కక్షపూరిత కేసు కాబట్టి కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
Read Also: Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ టెన్షన్ పెట్టింది కానీ.. రిలీజ్ కి స్పెషల్ ప్లాన్