జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ గడువు ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. దీంతో ఆర్వో కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన అభ్యర్థులను అధికారులు లోనికి అనుమతించారు. ఆర్వో కార్యాలయం కాంపౌండ్ లో భారీగా క్యూ కట్టారు స్వతంత్ర అభ్యర్థులు. సుమారు వందకు పైగా స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం.
Also Read:Renu Desai : ఎట్టకేలకు సినిమా సైన్ చేసిన రేణు దేశాయ్.. కానీ?
గేట్ లోపల ఉన్న అభ్యర్థుల నామినేషన్లు ఆర్వో అధికారి స్వీకరించనున్నారు. గడిచిన 9 రోజుల్లో రెండు రోజులు సెలవు మినహా 7 రోజుల్లో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. చివరి రోజు కావడంతో ఈ రోజు కూడా భారీ సంఖ్యలో వచ్చారు స్వతంత్ర అభ్యర్థులు.. రేపు అధికారులు నామినేషన్ల పరిశీలనను చేపట్టనున్నారు. ఈనెల 24వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఇక పోలింగ్ నవంబర్ 11న నిర్వహిస్తారు. అలాగే ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరిగి, ఎన్నికల ప్రక్రియను నవంబర్ 16 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది.
