JSW Group: ఇక ఎలక్ట్రిక్ ట్రక్కుల వంతు.. 55 టన్నుల ట్రాక్టర్-ట్రైలర్‌తో ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JSW గ్రూప్ కమర్షియల్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ అయిన JSW గ్రీన్‌టెక్ లిమిటెడ్ ‘AMPSTAR’ అనే కొత్త బ్రాండ్‌ను లాంచ్ చేయడం ద్వారా కమర్షియల్ మొబిలిటీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ బ్రాండ్ ద్వారా ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులను డిజైన్ చేసి, తయారీ చేసి విక్రయించనుంది. కేవలం వాహనాల విక్రయమే కాకుండా.. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆపరేటింగ్ సొల్యూషన్స్, ఫైనాన్సింగ్ ఆప్షన్స్, ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్‌ను కూడా కస్టమర్లకు అందిస్తుంది.
ఈ AMPSTAR వాహనాలు కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా 150 కిలోవాట్ల నుంచి 500 కిలోవాట్ల వరకు పవర్ కాన్ఫిగరేషన్లతో లభిస్తాయి. అంతేకాకుండా.. వాహనాలను నేరుగా కొనుగోలు చేయడం, లీజుకు తీసుకోవడం, బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) వంటి విభిన్న ఓనర్షిప్ మోడల్స్‌ను కస్టమర్లు ఎంచుకోవచ్చు. ఈ వాహనాలు భారదేశ వాతావరణం, రోడ్డు పరిస్థితులకు తగినట్లుగా పూర్తిగా ఇన్-హౌస్‌గా డిజైన్ చేయబడ్డాయి.
Also Read
- KTR: కరెంట్ కోతలపై కేటీఆర్ ఫైర్.. ‘ఇది ఎల్ నినో కాదు.. ఎల్ కాంగ్రెస్’.!
- YS Jagan: అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి డీఎస్సీనే ఉదాహరణ!
- SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
- Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా 'వెజ్ సూప్' ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఉన్న AURIC వద్ద గల JSW ఇంటిగ్రేటెడ్ EV తయారీ కేంద్రంలో వీటిని తయారు చేయనున్నారు. రూ. 2,500 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఏర్పాటైన ఈ ప్లాంట్ వార్షికంగా 15,000 ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ తయారీ యూనిట్లో ఆటోమేటెడ్ ట్రక్-కేబిన్ లైన్, ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ ఎకోసిస్టమ్ కూడా ఉన్నాయి.
JSW గ్రీన్‌టెక్ లిమిటెడ్ CEO సుమిత్ మిట్టల్ మాట్లాడుతూ.. బస్సుల విభాగంలో 7 మీటర్ల నుంచి 18 మీటర్ల పొడవున్న బస్సులను అందిస్తున్నట్లు తెలిపారు. ఇవి స్టాఫ్ ట్రాన్స్‌పోర్టేషన్, సిటీ, ఇంటర్సిటీ, స్కూల్ మొబిలిటీ వంటి వివిధ అవసరాలకు ఉపయోగపడతాయి. ఇక ట్రక్కుల విషయానికి వస్తే.. అత్యంత డిమాండ్ ఉన్న 55-టన్నుల ట్రాక్టర్-ట్రైలర్‌తో ట్రక్కుల సిరీస్‌ను ప్రారంభించి, రాబోయే నెలల్లో టిప్పర్లు, ఫిక్స్డ్-బాడీ డంపర్లకు తమ వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Shruti Haasan: ఆ బంధంలో బందీగా ఉండలేను.. పెళ్లి కాకుండానే తల్లిని అవుతా!
-
JSW Group: ఇక ఎలక్ట్రిక్ ట్రక్కుల వంతు.. 55 టన్నుల ట్రాక్టర్-ట్రైలర్‌తో ఎంట్రీ..
-
KTR: కరెంట్ కోతలపై కేటీఆర్ ఫైర్.. ‘ఇది ఎల్ నినో కాదు.. ఎల్ కాంగ్రెస్’.!
-
YS Jagan: అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి డీఎస్సీనే ఉదాహరణ!
-
SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!