యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ ముల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు ఎన్టీఆర్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
Also Read : Ravi Teja : రోత పుట్టించిన మాస్ జాతర ఫస్ట్ సింగిల్.. టూ మచ్
అయితే ఆ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నాయి. హిందీ, తెలుగు వర్షన్స్ లో బుకింగ్స్ ఓపెన్ చేయగా చాలా అంటే చాలా మందకొడిగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 652 లొకేషన్స్ లో 1739 షోస్ కు గాను 8117 టికెట్స్ బుక్ అవగా $213,545 మాత్రమే వసూలు చేసింది. బుకింగ్స్ ఓపెన్ చేసిన మొదటి రోజు సూపర్ స్టార్ట్ అందుకున్నవార్ 2 రాను రాను నెమ్మదించింది. ఇంత తక్కువ అడ్వాన్స్ సేల్స్ కు కారణాలు ఏంటని ఆరాతీయగా హిందీ వర్షన్ బుకింగ్స్ ను ఎక్కువ షోస్ ఓపెన్ చేసి తెలుగు వర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ ను లిమిటెడ్ గా మాత్రమే ఓపెన్ చేయడం ఒక కారణంగా పేర్కొంటుంది ట్రేడ్. అలాగే వార్ 2 ప్రమోషన్స్ పై కూడా మేకర్స్ అంతగా పట్టించుకోవడం లేదు. ఇక మరొక బిగ్గెస్ట్ రీజన్ అంటే వార్ 2 హిందీ వర్షన్ 2 టికెట్స్ ధర 36 డాలర్స్ ఉంటె తెలుగు వర్షన్ 2 టికెట్స్ 60 డాలర్స్ గా ఉంది. అంత భారీ ధర చూసేందుకు కూడా ఆడియెన్స్ అంత ఆసక్తి చూపించడం లేదు. కారణాలు ఏవైనా వార్ 2 USA అడ్వాన్స్ సేల్స్ అంతంత మాత్రమే.