గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా ఉన్నాడు.. మరోవైపు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్‌తో కూడా ఫుల్ బిజీగా మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవర సినిమా షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా తారక్ అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్‌తో ఫుల్ బిజీగా మారిపోయాడు.. ఇప్పటికే ఎన్నో బ్రాండ్స్ తారక్ చేస్తున్న సంగతి తెలిసిందే..
తాజాగా మరో బ్రాండ్‌కు అంబాసిడర్‌గా మారాడు. పాపులర్ జ్యువెల్లర్ కంపెనీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కు జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్టు ప్రకటించారు.. తారక్ స్టైలిష్ లుక్‌లో ఉన్న స్టిల్‌ను షేర్ చేసింది కంపెనీ. తారక్ కుర్తా పైజామాలో మెస్మరైజింగ్ గెటప్‌లో కనిపిస్తూ.. అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ న్యూ లుక్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. తారక్ ఇటీవలే McDonald బ్రాండ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.. ఆ యాడ్ వీడియో కూడా నెట్టింట ట్రెండ్ అవుతుంది..
ఇక సినిమాల విషయానికొస్తే.. దేవర సినిమా తో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన దేవర లుక్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తోంది. భారీ బడ్జెట్‌తో యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చిన అన్ని అప్డేట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నాయి.. సినిమా పై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.. జాన్వీ కపూర్ మొదటి సినిమా కావడంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఇప్పటికే దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది..