Jr NTR : ‘డ్రాగన్’ వేట మొదలైంది.. ఎన్టీఆర్.. ఎయిర్పోర్ట్ వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. దేవరతో సాలిడ్ హిట్ అందుకుని తన మార్కెట్ ను నార్త్ లోను పదిలం చేసుకున్నాడు. అయితే గతేడాది వచ్చిన వార్ తో ప్లాప్ అందుకున్న ఎన్టీఆర్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ కొట్టాలనే కసి తో ఉన్నాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
Also Read : Funky : బూతులు తిట్టేసే విశ్వక్ సేన్ కాదు.. ఇప్పుడు తను మారాడు : నాగవంశీ
Also Read
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
దేవర సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఎన్టీఆర్ నేడు జోర్డాన్ బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లను మరియు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను జోర్డాన్‌లోని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారు. దాదాపు రెండు వారాల పాటు సాగే ఈ లాంగ్ షెడ్యూల్లో ఎన్టీఆర్ తో పాటు మలయాళ నటుడు తోవినో థామస్ కూడా పాల్గొననున్నారు. ‘డ్రాగన్’ సినిమాలో ఎన్టీఆర్ లుక్ మునుపటి కంటే చాలా వైల్డ్ గా మరియు పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం. దీని కోసం తారక్ ప్రత్యేకమైన మేకోవర్ కూడా అయ్యారు. జోర్డాన్ షెడ్యూల్ ముగిసిన తర్వాత చిత్ర యూనిట్ తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. ఎయిర్పోర్ట్ వీడియోలో ఎన్టీఆర్ సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తుండటంతో నందమూరి అభిమానులు ఆ వీడియోను తెగషేర్ చేస్తున్నారు.
జోర్డాన్ బయలుదేరిన #JrNTR అక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నారు. మళయాల హీరో టోవినో కూడా ఈ షూట్ లో పాల్గొంటారు.. #ManOfMassesNTR #JrNTR #Dragon
— తార-సితార (@Tsr1257) February 8, 2026
తాజావార్తలు
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
-
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!