సంగారెడ్డిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను అభివృద్ధి చేయడం కంటే అప్పుల కూపీలోకి తీసుకెళ్లారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ దోపిడీ తెలంగాణలో సాగుతుందని.. కేసీఆర్ పాలనలో భారీ అవినీతి జరుగుతుందని ఆయన మండిపడ్డారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని కేసీఆర్ అంటున్నారని.. బీజేపీ అధికారంలోకి వస్తే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పారు.
Jammu Kashmir: రాజౌరీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఆర్మీ అధికారులతో సహా ముగ్గురు జవాన్ల వీరమరణం..
ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ పై నడ్డా తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అంటే భారత రాక్షస సమితి అని విమర్శించారు. ధరణితో పేదల భూములు గుంజుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కి ఏటీఎంగా మారిందని.. రూ.38 వేల కోట్ల ప్రాజెక్టు లక్ష కోట్ల వ్యయం పెరిగిందని చెప్పారు. అంతేకాకుండా.. మియాపూర్ భూముల్లో అవకతవకలు జరిగాయని నడ్డా ఆరోపించారు. ఓటర్ రింగ్ రోడ్డులో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. ఇలాంటి వాళ్ళని జైల్లో వెయ్యలా వద్దా అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. ప్రధాని అవాస్ యోజన కింద 20 వేల ఇల్లు ఇస్తే… డబుల్ బెడ్ రూమ్ స్కీంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ 5G నడుస్తుందని దుయ్యబట్టారు. ఇలాంటి రౌడీ రాజ్యాన్ని దోచుకునే రాజ్యాన్ని కొనసాగిద్దామా అని ప్రశ్నించారు.
Chandrababu: చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్‌లపై విచారణ వాయిదా
మహిళలకు ఆర్థిక స్వాలంబన లభించాలంటే బీజేపీకి ఓటేయండి జేపీ నడ్డా తెలిపారు. మన మధ్య ఉన్న బేధాలను పక్కకు పెట్టి పార్టీ గెలుపు కోసం పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని అధికారంలోకి మళ్ళీ వస్తే రెండేళ్లలో మూడో స్థానంలో వస్తుందని చెప్పారు. గత పదేళ్ళలో కోటి మందికి ఉద్యోగాలు ఇచ్చామని.. అన్ని వర్గాలకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే నవంబర్ 30న కమలం పువ్వు గుర్తుకు ఓటెయ్యండని సూచించారు. తెలంగాణలో 26 లక్షల బీద కుటుంబాలకు 5 లక్షల ఆరోగ్య భీమా ఇస్తామని చెప్పారు. 38 లక్షల కుటుంబాలకు తాగు నీరు ఇస్తున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని నడ్డా పేర్కొన్నారు.