Jowar Murukulu Recipe: హెల్తీ అండ్ టేస్టీ.. బియ్యపుపిండి వాడకుండా కరకరలాడే జొన్న మురుకులు ఇంట్లోనే చేసేయండి ఇలా..!
- బియ్యపుపిండి లేకుండా జొన్న మురుకులు తయారీ
- హెల్తీ, తేలికగా జీర్ణమయ్యే స్నాక్
- డయాబెటిస్, వెయిట్ లాస్‌కు అనుకూలమైన వంటకం
- జొన్న పిండి ప్రధాన పదార్థంగా ఉపయోగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jowar Murukulu Recipe: ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రుచికరమైన స్నాక్స్ తినాలనుకునే వారికి జొన్న పిండి మురుకులు ఒక బెస్ట్ ఛాయస్. సాధారణంగా మురుకులు అంటే బియ్యపుపిండి గుర్తుకు వస్తుంది. కానీ, జొన్న పిండితో చేసిన మురుకులు మరింత పోషక విలువలతో పాటు తేలికగా జీర్ణమవుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు ఈ హెల్తీ స్నాక్ ను నిరభ్యంతరంగా ఆస్వాదించవచ్చు. తక్కువ జిగురు ఉండే జొన్న పిండితో కూడా కొన్ని సులభమైన చిట్కాలతో కరకరలాడే మురుకులు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా జొన్న పిండితో వంటలు చేసేటప్పుడు జిగురు తక్కువగా ఉంటుంది. కానీ, కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే ఎంతో రుచికరమైన మురుకులను మనం సిద్ధం చేసుకోవచ్చు.
Also Read
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
- Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!
కావలసిన పదార్థాలు:
* జొన్న పిండి: 1/2 కిలో (సుమారు 4 కప్పులు)
* పుట్నాల పప్పు (వేయించిన శనగపప్పు): 1 కప్పు (125 గ్రాములు)
* ధనియాలు: 1 టేబుల్ స్పూన్
* జీలకర్ర: 1 టీస్పూన్
* వాము: 1 టీస్పూన్
* నువ్వులు: 2 టేబుల్ స్పూన్లు
* కారం: 2 టీస్పూన్లు
* ఇంగువ: 1/2 టీస్పూన్
* పసుపు: చిటికెడు
* ఉప్పు: రుచికి సరిపడా
* నూనె: వేయించడానికి సరిపడా
* వేడి నీళ్లు: పిండి కలపడానికి
తయారీ విధానం:
పిండి సిద్ధం:
ముందుగా ఒక మిక్సీ జార్ లోకి ఒక కప్పు పుట్నాల పప్పు, ధనియాలు, జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలోని జొన్న పిండిలోకి తీసుకోవాలి. పుట్నాల పిండి లేకపోతే ఒక కప్పు శనగపిండినైనా వాడుకోవచ్చు.
మసాలాలు కలపడం:
ఈ పిండి మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, కారం, నువ్వులు, పసుపు, ఇంగువ వేయాలి. వామును చేతిలో వేసి కొంచెం నలిపి వేస్తే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి.
GST Scam: రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం బట్ట బయలు.. తెలుగు రాష్ట్రాలలో 72 షెల్ కంపెనీలు గుర్తింపు..!
వేడి నీళ్లతో పిండి కలపడం:
జొన్న పిండికి జిగురు రావాలంటే కచ్చితంగా వేడి నీళ్లను ఉపయోగించాలి. నీళ్లను వేడి చేసి, పిండిలో కొంచెం కొంచెంగా పోస్తూ ముద్దలా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్ గా ఉండేలా చూసుకోవాలి. వేడి నీళ్ల వల్ల మురుకులు కరకరలాడుతూ వస్తాయి.
మురుకులు ఒత్తడం:
మురుకుల మెషిన్‌కు లోపల కొంచెం నూనె రాసి, సిద్ధం చేసుకున్న పిండిని అందులో ఉంచాలి. స్టౌ మీద బాండీ పెట్టి నూనె వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక, నేరుగా నూనెలోకి మురుకులను ఒత్తుకోవాలి. జొన్న పిండి కాబట్టి రౌండ్ గా ఒత్తేటప్పుడు విడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ నూనెలో వేయడం సులభం.
ఫ్రై చేయడం:
మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మురుకులను వేయించాలి. నూనెపై వచ్చే నురగ పూర్తిగా తగ్గిపోయే వరకు వేయిస్తేనే మురుకులు లోపలి వరకు వేగి క్రిస్పీగా ఉంటాయి. నురగ తగ్గిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. చివరగా కొంచెం కరివేపాకును నూనెలో వేయించి మురుకులపై వేసుకుంటే మంచి వాసనతో పాటు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జొన్న మురుకులను మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి.
తాజావార్తలు
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
-
Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!