టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదట చిన్న ఆర్టిస్ట్ గా జోష్, ఆరెంజ్ వంటి సినిమాల్లో కనిపించిన సిద్దు తరువాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఆ సినిమాలు అతనికి మంచి క్రేజ్ ను ఇవ్వలేక పోయాయి.. దాంతో రైటర్ గా కూడా ప్రూవ్ చేసుకున్నాడు… ఆ తర్వాత డిజే టిల్లు సినిమా అతని కేరీర్ కు మంచి టర్నింగ్ పాయింట్ అయ్యింది..
ఆ సినిమా సిద్దుకు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించింది. ఒక్కసారిగా సిద్దు రేంజ్ ఈ సినిమాతో మారిపోయింది అని చెప్పొచ్చు.. ఈ సినిమా అంతటి విజయాన్ని సొంతం చేసుకుంది.. ఈ సినిమాకు సీక్వెల్ గా రీసెంట్ గా టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసే కలెక్షన్స్ ను అందుకుంది.. ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు క్యూబ్ రాబోతున్న సంగతి తెలిసిందే..
ఇదిలా ఉండగా.. సిద్దు రేటు పెంచేసినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. డీజే టిల్లు సినిమా వరకు సిద్దు రెమ్యూనరేషన్ ఐదు కోట్ల వరకు ఉండేదంట. అయితే ఇప్పుడు సిద్దు ఏకంగా తన రెమ్యూనరేషన్ మూడు రెట్లు పెంచాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అంటే సిద్దు తర్వాత చేసే సినిమాలకు 15 కోట్ల వరకు వసూల్ చెయ్యనున్నట్లు టాక్.. ఇక “తెలుసు కదా”అనే ప్రాజెక్టు లో చేస్తున్నాడు. నీరజ్ కోన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.అలాగే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్నాడు..