Site icon NTV Telugu

Jogu Ramanna : రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే జోగురామన్న సవాల్

Jogu Ramanna

Jogu Ramanna

ఇటీవల టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న విమర్శలు గుప్పించారు. అయితే.. రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై జోగు రామన్న కౌంటర్‌ ఇచ్చారు. ఇవాళ జోగు రామన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉరేసుకుంటా… రాకుంటే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటావా అంటూ జోగురామన్న సవాల్ విసిరారు. నీకు నమ్మకం ఉంటే నేను చేసిన సవాల్ ను స్వీకరిస్తావా అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం, బీఆర్ఎస్‌పై అమర్యాదగా మాట్లాడితే నాలుక చీరేస్తామని జోగు రామన్న హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పట్ట పగలు దొరికిన దొంగవు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.

Also Read : Madhya Pradesh: ఎన్నికల ముందు కాంగ్రెస్‌కి ఎదురుదెబ్బ.. కమల్‌నాథ్ ఇలాకాలో బీజేపీ ఘన విజయం

చంద్రబాబును జోకిన చరిత్ర నీది అంటూ ఆయన ధ్వజమెత్తారు. అంతేకాకుండా.. తనను కించపర్చే విధంగా మాట్లాడావు.. బడుగు బలహీన వర్గాల‌ ఎమ్మెల్యేను అవమాన పరిచిన నువ్వు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించిన చోట అంబేద్కర్ విగ్రహం ఉంటే.. కనీసం పూల మాల వేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను అవమానించావని, క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నా అని ఆయన అన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో‌‌ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్దమన్నారు. కేసీఅర్, కేటీఅర్, ఉద్యోగాలు ఊడపీకుతా అంటున్నావని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ‌‌రాకపోతే ‌నేను ఉరివేసుకుంటానని ఆయన అన్నారు.

Also Read : Madhyapradesh: ముస్లిం మహిళను లేపుకెళ్తే రివార్డ్.. ప్రకటించిన హిందూ ధర్మ సేన

Exit mobile version