England Team: ఇంగ్లాండ్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు..? కెప్టెన్సీ రేసులో సీనియర్ బ్యాటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం బెన్ స్టోక్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో, ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ రేసు ఆసక్తికరంగా మారింది. రాబోయే పాకిస్థాన్ సిరీస్‌కు ముందు కొత్త కెప్టెన్‌ను ప్రకటించడానికి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సిద్ధమవుతోంది. ఈ క్రమంలో జట్టు సీనియర్ బ్యాటర్ జో రూట్ మళ్లీ టెస్టు సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు ముందంజలో ఉన్నట్లు సమాచారం.
2017 నుండి 2022 వరకు ఇంగ్లాండ్ జట్టును నడిపించిన రూట్, మొత్తం 64 టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించి 27 విజయాలను అందించాడు. అలిస్టర్ కుక్ రికార్డును అధిగమించి ఇంగ్లాండ్ తరఫున అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాడిగా, అలాగే ప్రపంచంలో అత్యధిక రన్స్ చేసిన టాప్-5 బ్యాటర్లలో ఒకడిగా రూట్ నిలిచాడు. ఆగస్టు 19 నుంచి ప్రారంభమయ్యే పాకిస్థాన్ సిరీస్ నుండి ఆయన కెప్టెన్సీ చేపట్టే అవకాశం ఉంది.
Also Read
- Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్‌పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం
- Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
- Punjab: ఆప్‌లోకి గ్యాంగ్‌స్టర్.. పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
- Delhi Building Collapse: "రక్షించండి".. బిల్డింగ్ శిథిలాల కింద నుంచి విద్యార్థుల ఫోన్ కాల్స్..
మరోవైపు బెన్ స్టోక్స్ మాత్రం యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ పేరును మద్దతు ఇచ్చాడు. ఇప్పటికే పరిమిత ఓవర్ల (ODI, T20) జట్టుకు కెప్టెన్‌గా, టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్న బ్రూక్‌కు బాధ్యతలు ఇవ్వడమే సహజమైన ప్రక్రియ అని స్టోక్స్ పేర్కొన్నాడు. ఒక కెప్టెన్ లేనప్పుడు ఉప కెప్టెన్ బాధ్యతలు స్వీకరించడమే సరైన పద్ధతి అని అభిప్రాయపడ్డాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన ఓవల్ టెస్టులో కూడా జో రూట్ జట్టును ముందుండి నడిపించాడు. రాబోయే యాషెస్ సిరీస్ వరకు రూట్ సారథిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని నివేదికలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్‌పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం
-
Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
-
Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తాం
-
Dada : ‘దాదా’గా బాలయ్య బ్లాస్టింగ్ ఎంట్రీ: పోలీసులపైనే రివాల్వర్ గురిపెట్టి!
-
Punjab: ఆప్‌లోకి గ్యాంగ్‌స్టర్.. పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!