జో రూట్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు.. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం చురుకైన ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు సాధించిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా జో రూట్ నిలిచాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు.. అతను మూడో స్థానంలో ఉన్నాడు. కానీ ఆగస్టు 29న లార్డ్స్‌లో తన టెస్ట్ కెరీర్‌లో 33వ సెంచరీని సాధించి రెండో స్థానాన్ని సాధించాడు.
READ MORE: SPY Camera: దారుణం.. ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ టాయిలెట్స్‌లో రహస్య కెమెరా..
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో యాక్టివ్‌గా ఉన్న ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు చేసిన ప్రత్యేక రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. ప్రస్తుతం అతడు మొత్తం 80 సెంచరీలు చేశాడు. అతని తర్వాత రూట్ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నాడు. రూట్ ఖాతాలో ఇప్పుడు మొత్తం 49 సెంచరీలు ఉన్నాయి. రూట్ కంటే ముందు.. భారత స్టార్ రోహిత్ శర్మ 48 సెంచరీలతో ప్రత్యేక జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. అయితే నిన్న రూట్ సెంచరీ చేయడం రోహిత్ ను దాటేశాడు. ‘హిట్‌మ్యాన్’ శర్మ ప్రస్తుతం 48 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు.
READ MORE: MPOX : ఎంపాక్స్ కొత్త, ప్రాణాంతకమైన వేరియంట్.. పిల్లలకు ముప్పు!
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన చురుకైన ఆటగాళ్లు
80 – విరాట్ కోహ్లీ
49 – జో రూట్
48 – రోహిత్ శర్మ
45 – కేన్ విలియమ్సన్
44 – స్టీవ్ స్మిత్
31 – బాబర్ ఆజం
28 – క్వింటన్ డి కాక్
23 – జానీ బెయిర్‌స్టో
20 – టామ్ లాథమ్
20 – ముష్ఫికర్ రహీమ్
READ MORE:Off The Record : ఆ ఉమ్మడి జిల్లా వైసీపీలో ఏం జరుగుతుంది..? ఆ మాజీ మంత్రి మనసులో మాటేంటి..
లార్డ్స్ టెస్టులో జో రూట్ 143 పరుగులు..
లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే ఇంగ్లండ్ టాప్ బ్యాట్స్‌మెన్‌లు శ్రీలంక బౌలర్ల ధాటికి తడబడ్డారు. కాగా, జో రూట్ తన జట్టు తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి మొత్తం 206 బంతులు ఎదుర్కొన్నాడు. 69.41 స్ట్రైక్ రేట్‌తో 143 పరుగులతో అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. అతని బ్యాట్ నుండి 18 అద్భుతమైన ఫోర్లు వచ్చాయి.